Minister Narayana: రాజధాని అమరావతితో హైవేల కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అందులో భాంగా రోడ్లను పరిశీలించారు మంత్రి నారాయణ.. అమరావతితో హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్లను పరిశీలించిన ఆయన.. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. హైవే నుంచి అమరావతికి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ అనుమతులపై మంత్రికి వివరించారు అధికారులు.. 1. E 13 – NH16 junction near DGP office , 2. E11 – AIIMS Junction , 3. E13 AIIMS Road crossing , 4. E13 AIIMS Campus Roundabout , 5. E13 crossing ROB, 6. E11- NH544F mangalagiri crossings , 7. E11 – Yerrabalem temple, 8. E11 Yerrabalem road crossing రోడ్లను పరిశీలించారు మంత్రి నారాయణ..
Read Also: Allu Arjun: రేవతి కుటుంబానికి క్షమాపణ.. శ్రీతేజని పరామర్శించనున్న అల్లు అర్జున్
ఇక, ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటి ఉండాలి అన్నారు.. గత ప్రభుత్వం తీసేసిన జీవోలు అథారిటీ సమావేశం ద్వారా తీసుకొచ్చాం.. మరో 20 వేల కోట్ల టెండర్లకు అథారిటీ అనుమతులు వచ్చే సోమవారం తీసుకుంటాం అన్నారు.. 16 రోడ్లను నేషనల్ హైవేకి కలపాలి.. అందులో E11, E13, E15.. మొదటి దశలో NHకు కలిపాలని నిర్ణయించాం.. E11 లో 39 ఎకరాలు, E13లో 22 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది.. ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టిన నిర్మాణాలున్నాయి.. చాలా తక్కువ గృహాలు డ్యామేజీ అవుతాయన్నారు.. E11 రోడ్డు 4.63 కిలోమీటర్లు AIMS పక్కన సర్వీసు రోడ్డులో కలుస్తుంది.. E13 రోడ్డు ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద కలుస్తుంది.. ఈ రోడ్లు 80 నుంచీ 100 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించగలిగేలా నిర్మిస్తామని వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..