ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రముఖ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ “పుష్ప”లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్ కు స్టన్ అయ్యిందట. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేస్తున్న మొదటి సినిమా లాగే చేస్తాడు… నేను షూటింగ్ లో ఉన్న నాలుగు రోజులు బన్నీ లో చాలా గమనించాను… అర్జునుడు చెట్టు మీద వున్న పక్షిపై మాత్రమే ఏకాగ్రత పెట్టినట్లుగా… బన్నీ కళ్ళు కూడా ఎప్పుడూ చెప్పిన పాయింట్ మీదే ఉంటాయని అనసూయ తెలిపింది. కాగా సుకుమార్ తెరకెక్కిస్తున్న’పుష్ప’ నుంచి బన్నీ పుట్టినరోజును పురస్కరించకుని ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది యూనిట్. ఇప్పటికీ ఈ వీడియో ‘తెగ్గేదే లే’ అంటూ ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’కు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.