స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు అల్లుఅర్జున్. “అందరికీ హలో! చాలా తేలికపాటి లక్షణాలే ఉన్నాయి. నేను బాగా కోలుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఇంకా సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను. మీరు చూపిస్తున్న ప్రేమకు, నా కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇచ్చిన అప్డేట్ తో ఆయన అభిమానుల్లో ఆందోళన తగ్గింది. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’తో బిజీగా ఉన్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు కరోనా వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్కబడిన తరువాత రీస్టార్ట్ అవుతుంది.