స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత వర్మ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ తన హెల్త్ కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. చాలా తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని ఇటీవలే ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతానికి ఆయన ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నాడు. అయితే తాజాగా అల్లు అర్జున్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ వంటింట్లోకి చేరి గరిటె పట్టింది. అది కూడా తన తండ్రి కోసం. తన చిన్ని చిన్ని చేతులతో అల్లు అర్జున్ కోసం దోశ వేసింది అర్హ. అల్లు అర్జున్ ఆ వీడియోను షేర్ చేస్తూ ‘నాన్న కోసం స్పెషల్ దోశ… ఈ దోశను ఎప్పటికి మరిచిపోలేను…. బహుశా దోశ వేయడం నా దగ్గరే నేర్చుకుందేమో’ అంటూ గతంలో అర్హ ‘రాములో రాములా’ సాంగ్ స్టెప్స్ పై వేసిన సెటైర్ ను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.