అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఇటీవల బన్నీ పుట్టినరోజు పురస్కరించకుని ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది యూనిట్. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో విడుదలైన 20 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో 50 మిలియన్ సాధించిన ఇంట్రోవీడియోగా రికార్డ్ సృష్టించింది. ఇక వ్యూస్ తో పాటు లైక్స్ విషయంలోనూ ఫాస్ట్ గానే ఉన్నాడు ‘పుష్ప’రాజ్. ఇప్పటికే 1.2 మిలియన్ లైక్స్ తో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఈ వీడియోలో బన్నీ డైలాగ్ ‘తగ్గేదే లే..’ లా వీడియో కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతోందని యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’కు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.