మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లానింగ్ గురించి తెలియని వారు లేరు. ఆయన ప్లాన్ వేస్తే ఇక తిరుగుండదు. చిరంజీవిని మెగాస్టార్ కావటం వెనుక అరవింద్ బుర్రకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక కాలానికంటే ముందు పరిగెత్తే బుర్ర అరవింద్ ది. సినిమాలు, రిలీజ్ లు, సక్సెస్ లు ఆ బుర్ర నుంచి కుప్పలు తెప్పలు గా వచ్చాయి. తాజాగా ఆయన బ్రెయిన్ నుంచి వచ్చిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తెలుగునాట అగ్రస్థానంలో నిలవటంలో ఆయన చిన్ని…
నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా వేడుకకు అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో ముఖ్యఅతిథిగా రావడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరం మేటి హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఫంక్షన్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ అంటే అర్థముంది కానీ, బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథి ఏంటి అనీ కొందరి ఆవేదన! గతంలో బాలయ్య ఆడియో వేడుకలను పరిశీలిస్తే, ఆయన ఇలాంటి వాటికి…
అసలు నందమూరి, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది ?… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మధ్య ఇదే ప్రశ్న మెదులుతోంది. గతంలో నందమూరి, మెగా ఫ్యామిలీలు పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లలో… అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలయ్య వేడుకకు అతిథిగా మెగా హీరో !నటసింహం నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇక ఇందులో బాలయ్య అఘోరా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ప్రీ రిలీజ్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి గల కారణాలు ఏంటి అనేవి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ ఈవెంట్ కి బన్నీ రావడానికి ముఖ్య కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆహా’…
టాలీవుడ్ స్టార్ హీరోలందరు ఒకే తాటిపై నడుస్తారు. స్టార్ హీరోల మధ్య పోటీ సినిమాల వరకే కానీ, నిజజీవితంలో నిత్యం హీరోలందరూ కలిసిమెలిసి ఉంటారు అనేది నమ్మదగిన విషయం. ఒకరి సినిమా గురించి మరొకరు.. ఒకరి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మరొకరు గెస్ట్ లుగా వచ్చి వారి సినిమాలను ప్రమోట్ చేస్తారు. ఇలా వచ్చే అతిధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ఇకపోతే ప్రస్తుతం బన్నీ మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి…
బాలీవుడ్ స్టార్ తో బన్నీ మల్టీస్టారర్ చేయబోతున్నాడు. టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం భారీగానే సన్నాహాలు మొదలెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… “జెర్సీ” హిందీ ట్రైలర్ లాంచ్ నవంబర్ 23న జరిగింది. ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్, మీడియా, ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఊహించిన విధంగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కన్నడ లేడీ రష్మిక మందన్న, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ నటించిన సుకుమార్ మాగ్నమ్ ఓపస్ “పుష్ప : ది రైజ్” విడుదల తేదీ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో “పుష్ప” ట్రైలర్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా…
ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో ‘ఢీ’ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 12 సీజన్లు విజయవంతంగా ముగిశాయి. ప్రస్తుతం 13వ సీజన్ హాట్హాట్గా కొనసాగుతోంది. కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్టెప్పులతో వీక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సెమీఫైనల్ పోరు నడుస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. అయితే గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ అగ్రహీరో గెస్టుగా రాబోతున్నాడు. అతడు ఎవరో కాదు. ఐకాన్ స్టార్ అల్లు…
టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ సమంత ఐటమ్ సాంగ్. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత తెలుగులో ఏ కొత్త సినిమా సైన్ చేయని సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయాన్ని అటు ‘పుష్ప’ యూనిట్ కాని ఇటు సమంత కానీ ధృవీకరించలేదు. అయితే ఈ నెల 28 నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలు కానుందని, దీనికోసం భారీ సెట్ ను రూపొందిస్తున్నారని, ఈ పాట కోసం సమంత కోటిన్నర…
మన స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ కుటుంబ సభ్యలుతో కలసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలసి ప్యారిస్ వీధులు చుట్టేస్తుండగా బన్నీ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో దుబాయ్ వీధుల్లో సంచరిస్తున్నాడు. షూటింగ్ లతో బిజీగా ఉండే వీరిద్దరూ కుబుంబం కోసం సమయం వచ్చించి ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…