ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’ సి చిత్రం 2022 డిసెంబర్ 17న బిగ్ స్క్రీన్‌లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ రేపు విడుదల కానుంది. చిత్రబృందము ఈ విషయాన్ని ప్రకటించినప్పటి నుంచీ బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే సినిమా ప్రమోషన్ లను ప్రారంభించారు. అందులో భాగంగా తాజగా “పుష్ప” ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
Read Also : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య… వీడియో వైరల్
ఈ వీడియోలో అల్లు అర్జున్ షూటింగ్ స్పాట్‌ను చాలా శుభ్రంగా ఉంచాలని, షూటింగ్ జరిగినన్ని రోజులూ ఎవరి ప్లాస్టిక్ బాటిళ్లను, ప్లాస్టిక్ కప్పులను వారే క్లీన్ చేసుకోవాలని స్పాట్ లోని నటీనటులు, సిబ్బందిని రిక్వెస్ట్ చేయడం కన్పించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లో టీమ్ పని చేస్తున్నంత కాలం ఉపయోగించిన వాటర్ బాటిళ్లు, ప్లాస్టిక్ కప్పులు, పేపర్లు వేయడానికి ప్రతి ఒక్కరూ చెత్త డబ్బాలను ఉపయోగించాలని ఆయన కోరారు. ఇక ఆ తరువాత సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో ట్రైలర్ పై మరిన్ని అంచనాలను పెంచేసింది అని చెప్పొచ్చు.
Read Also : “ఆచార్య”తో పోటీకి సై… తగ్గేదే లే అంటున్న స్టార్ హీరో, హీరోయిన్
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ రఫ్ లుక్, అతని అద్భుతమైన నటనను చూడటానికి సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే ప్లే లిస్ట్ లో టాప్‌లో నిలిచాయి.