స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం “పుష్ప”తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. సుకుమార్ దర్శకుడు కాగా, రష్మిక మందన్న కథానాయిక. షూటింగ్ ప్రారంభం కాకముందే మేకర్స్ హిందీ హక్కులను అమ్మేశారు. గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ రెండేళ్ల క్రితం భారీ ధరకు హక్కులను సొంతం చేసుకుంది. షూటింగ్ ప్రారంభమైన వెంటనే సుకుమార్, అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ ప్లాన్‌లను మార్చిన తర్వాత పుష్ప నిర్మాతలు ఇంతకుముందు చేసుకున్న ఒప్పందాలను మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించారని ప్రచారం జరిగింది. అయితే ఆ పని నిర్మాతల వల్ల కాలేదని, అల్లు అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి సమస్యను సమరస్యపూర్వకంగానే పరిష్కరించారని అన్నారు. అయితే మేకర్స్ ఈ తప్పుకు కాస్ట్లీ మూల్యం చెల్లించుకోక తప్పట్లేదని అంటున్నారు.
Read Also : వేప రసం లాంటి నిజం… మెల్లగా దిగుతుంది… నెటిజన్ కు డైరెక్టర్ రిప్లై
గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్‌కు చెందిన మనీష్ షా ఇప్పుడు ‘పుష్ప’ హిందీ వెర్షన్‌ను అందిస్తున్నారు. ఏఏ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం విడుదల ఖర్చులను భరించవలసి ఉంటుంది. అయితే గోల్డ్‌మైన్ టెలిఫిల్మ్స్ లాభాల నుండి ప్రధాన వాటాను తీసుకుంటుందని, అయితే ఏఏ ఫిల్మ్స్ చిత్రాన్ని ఉత్తర భారత సర్క్యూట్‌లలో విడుదల చేస్తుంది కాబట్టి లాభాల్లో కొంత శాతాన్ని పొందుతుందని చెబుతున్నారు. అయితే మైత్రీ ఈ రిస్క్ భరించక తప్పదని, కానీ వాళ్ళు సంతోషించాల్సిన విషయం ఏమిటంటే హిందీ హక్కులను ముందుగానే విక్రయించడం వల్ల లాభాలలో కొద్దిపాటి వాటాను వస్తుందని టాక్. డిసెంబర్ 17న ‘పుష్ప’ దేశవ్యాప్తంగా భారీ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.