‘పుష్ప’ ట్రైలర్: ‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటివే.. ‘ఫైర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ‘పుష్ప’ ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కొన్ని సాంకేతిక కారణాలవలన ఆలస్యం అయ్యిందని చెప్పినా ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు ట్రైలర్ ని విడుదల చేశారు. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను రేపుతోంది. ‘పుష్ప’ రాజ్ గా బన్నీ మాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
శేషాచలం అడవుల్లో అరుదుగా దొరికే ఎర్రచందనం చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ అక్కడి వారు బతుకుతూ ఉంటారు. గంధపు చెక్కల స్మగ్లర్ గా పుష్పరాజ్ పనిచేస్తుంటాడు.. వాటిని పోలీసులకు తెలియకుండా రాష్ట్రం దాటిస్తూ ఉంటాడు.. వీరిద్దరికి మధ్య జరిగే యుద్ధమే పుష్ప.. పోలీసులకు, స్మగర్లకు మధ్య రాజకీయ నాయకులు, దళారులు ఎలా వీరిని వాడుకున్నారు అనేది చూపించారు. ఇక మధ్యలో పుష్ప, శ్రీవల్లీల రొమాన్స్ ఆకట్టుకొంటుంది.. ఇక చివర్లో ఫహద్ ఫాజిల్ పార్టీ లేదా పుష్ప అంటూ వెటకారంగా అన్న డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. బన్నీ మాస్ అవతార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సునీల్ , అనసూయ , రావు రమేష్ పాత్రలు విలనిజాన్ని మారుపేరుగా కనిపించాయి.. ఫహద్ ఫాజిల్ ని ఒక ఫ్రేమ్ లో చూపించినా అతని పాత్ర ఎలాంటిదో తెలిసిపోతుంది. మొత్తానికి పుష్ప ట్రైలర్ తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో బన్నీ- సుక్కు హ్యాట్రికి హిట్ ని తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..