Akash Puri : టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వరుసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఆయనకు హిట్లు లేవు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ సేతపుతితో పాన్ ఇండియా సినిమాను ప్రకటించాడు. ఈ మూవీ కోసం బాగానే కష్టపడుతున్నాడు పూరి. అయితే ఆయన కొడుకు ఆకాశ్ పూరి కూడా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.…
Director Puri Jagannadh Son Akash Puri Changed His Name: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ బాల్య నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిరుత, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో బుల్లి హీరోగా అలరించారు. ‘ఆంధ్రాపోరీ’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్.. మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ సినిమాల్లో నటించారు. ఆకాశ్ చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం ఈ యువ హీరో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.…
Hero Akash Puri becomes Brand Ambassador for RC Trendsetters clothing brand: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి. ఆకాష్ పూరి ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ హీరో “రొమాంటిక్” అనే కొత్త సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా…
Akash Puri to marry his love intrest soon: ఈ మధ్య కాలంలో కేవలం తెలుగు అని కాదు దాదాపు అన్ని భాషల్లో ఉన్న కుర్ర హీరోలు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతూ ఒకింటి వారు అవుతున్నారు. ఈమధ్య తెలుగులో కూడా చాలా మంది హీరోలు పెళ్లి పీటలు ఎక్కగా ఇప్పుడు మరో హీరో అదే బాటలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు పూరీ జగన్నాథ్ తనయుడు, హీరో ఆకాష్ పూరి. ఆకాష్ త్వరలో…
వివాదాస్పద ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నిర్మాత బండ్ల గణేశ్.. చోర్ బజార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘ఎందరినో స్టార్ హీరోల్ని చేసిన నీకు, నీ కొడుకు ఈవెంట్ కి రావడానికి టైం లేదా? ముంబైలో వెళ్లి కూర్చున్నావ్’’ అంటూ ఓ రేంజ్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతేకాదు.. ‘పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావ్, వాళ్లందరినీ చచ్చేదాకా చూసుకోవాల్సిన బాధ్యత నీదే’నంటూ వ్యక్తిగతంగానూ టార్గెట్ చేశాడు.…
ఆకాశ్ పూరి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన పూరి జగన్నాథ్ తనయుడు. పూరి ఫుల్ ఫామ్ లో ఉన్నపుడు వరుసగా బాలనటుడుగా ‘చిరుత, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిజినెస్ మేన్’ సినిమాల్లో నటించాడు. తండ్రి సినిమాలే కాదు ‘ద లోటస్ పాండ్, ధోని, గబ్బర్ సింగ్’ వంటి ఇతర దర్శకుల సినిమాల్లో సైతం చైల్డ్ అర్టిస్ట్ గా మెరిశాడు. ఆ తర్వాత లేలేత వయసులోనే మరాఠీ రీమేక్ ‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ…
బండ్ల గణేష్. కామెడియన్‌గా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి.. నటుడిగా ఎదుగుతూ నిర్మాతగా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడూ ప్రత్యేకం. ఆ ప్రత్యేకత కారణంగానే ఆయన ఏం మాట్లాడినా సంచలనంగా మారుతుంది. పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా చెప్పుకొంటారు. సినిమా పంక్షన్స్‌లో మైక్ పట్టుకుంటే పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు కూడా. అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో? ఏం మాట్లాడాలని ఇంకే మాట్లాడుతున్నారో అర్థం…
శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ సినిమా శుక్రవారం రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శర్వానంద్ క్లాప్ కొట్టగా అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సాయి రామ్…