బండ్ల గణేష్. కామెడియన్‌గా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి.. నటుడిగా ఎదుగుతూ నిర్మాతగా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడూ ప్రత్యేకం. ఆ ప్రత్యేకత కారణంగానే ఆయన ఏం మాట్లాడినా సంచలనంగా మారుతుంది. పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిగా చెప్పుకొంటారు. సినిమా పంక్షన్స్‌లో మైక్ పట్టుకుంటే పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు కూడా. అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో? ఏం మాట్లాడాలని ఇంకే మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. రాజకీయ నేతలను.. సినీ పరిశ్రమకు చెందిన వారినీ విడిచి పెట్టడం లేదు. దాంతో బండ్ల గణేష్‌కు ఏమైంది అనే చర్చ జరుగుతోంది.
ఆకాశ్ పూరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన బండ్ల గణేష్.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఎంతో మంది హీరోలను స్టార్స్‌ను చేసిన పూరీ జగన్నాథ్.. సొంత కుమారుడు ఆశాష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోవడం బాధాకరమని కలకలం రేపారు. ఫంక్షన్‌కు రాకుండా ఎక్కడో ముంబైలో ఉండటం సరికాదన్నది గణేష్ వాదన. అదే వేదికపై నుంచి పూరీ సతీమణిని ఆకాశానికి ఎత్తేశారు. ఈ ఫంక్షన్ అంతా ఒక్ ఎత్తు అయితే.. అందులో బండ్ల గణేష్ చేసిన కామెంట్సే హైలైట్ అయ్యాయి. పూరీ జగన్నాథ్ కో ప్రొడ్యూసర్, నటి ఛార్మి గురించి పరోక్షంగా విమర్శలు సంధించారు.
ఇదే కాదు.. గతంతో పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో బండ్ల గణేష్ పేరుతో రిలీజైన ఒక ఆడియో వైరల్ అయ్యింది. అందులో డైరెక్టర్ త్రివిక్రమ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భ్లీమా నాయక్ ఈవెంట్‌కు తనను ఆహ్వానించలేదని.. దర్శకుడు త్రివిక్రమ్ తనను దూరం పెట్టారని చెబుతూనే.. వైసీపీ నేతలతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతేకాదు.. ఎక్కువగా నమ్మడం.. ఎక్కువగా ప్రేమించడం.. ఎక్కువగా ఆశించడం.. ఎక్కువగా చనువు ఇవ్వడం వల్ల వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుందని వరుసగా ట్వీట్లు సంధించారు బండ్ల గణేష్. అయితే త్రివిక్రమ్‌పై గణేష్ చేసిన కామెంట్స్ రకరకాల చర్చకు దారితీశాయి. ఇద్దరికీ పాత గొడవలు ఉన్నాయా అని ఆరా తీసినవారు ఉన్నారు.
జీవితంలో ఎవరిని నమ్మకూడదని.. కేవలం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు.. మనల్ని నమ్ముకుని వచ్చిన భార్య మన పిల్లలను మాత్రమే నమ్మాలన్న వ్యాఖ్యలు .. బండ్ల గణేష్‌లోని ఫస్ట్రేషన్‌ను బయట పెడుతున్నట్టు కొందరు అభిప్రాయ పడుతున్నారు. వైసీపీ కీలక నేతను ఉద్దేశించి కూడా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. త్వరలో జగన్‌కు వెన్నుపోటు అంటూ ట్వీట్ చేయడం పెద్ద చర్చే దారితీసింది. టీడీపీకి మద్దతుగా.. వైసీపీపై చేసిన విమర్శలు ఆ ట్వీట్స్‌లో కనిపించాయి. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఆశించింది దక్కక బండ్ల ఈ విధంగా ఔట్ అవుతున్నారా? లేక రాజకీయంగా నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించక ఇబ్బంది పడుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కామెడియన్‌గా ప్రయాణం ప్రారంభించి.. మధ్యలో సీరియస్ పాత్ర పోషించి.. చివరికి బండ్ల గణేష్ కామెడీ అయిపోతున్నారనే సెటైర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.