తన ‘చోర్ బజార్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆకాశ్ పూరీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా.. నెపోటిజంపై సుదీర్ఘంగా ప్రసంగించాడు. తనపై కూడా నెపోటిజం కామెంట్స్ వచ్చాయని తెలిపిన ఆకాశ్.. బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చిన ట్యాలెంట్ నిరూపించుకుంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారని, తానూ అదే ప్రయత్నం చేస్తున్నానని తెలిపాడు. తాను చిటికేస్తే కోరుకున్నవన్నీ తన ముందు వాలుతాయని, తన తండ్రి ఏం అడిగినా ఇచ్చేంత సౌకర్యం తనకుందని, కానీ తాను మాత్రం తన కాళ్లపై నిలబడాలనుకుంటున్నానని, అందుకే కష్టపడుతున్నానని అన్నాడు.…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మన టాలీవుడ్‌లో మంచి కామిక్ టైమింగ్ ఉన్న నటుల్లో విశ్వక్ సేన్ ఒకడు. సందు దొరికితే చాలు.. సెటైరికల్ పంచ్‌లతో గిలిగింతలు పెట్టించేస్తాడు. లేటెస్ట్‌గా చోర్ బజార్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ ఇతను ఏకంగా యాంకర్ ఉదయ భానుపైనే ఛలోక్తులు పేల్చి నవ్వులు పూయించేశాడు. ఈ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన విశ్వక్ సేన్‌ను ఉదయ భాను వేదిక మీదకి పిలిచింది. అతడు రాగానే, సినిమాల్లో కన్నా రియల్‌గానే చూడ్డానికి చాలా బాగున్నావంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అప్పుడు విశ్వక్ సేన్…
పాతికేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘చోర్ బజార్’ చిత్రంతో తెలుగు తెరపై కనిపించబోతోంది నిన్నటితరం ప్రముఖ నాయిక, జాతీయ ఉత్తమ నటి అర్చన. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు దీనిని నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అర్చన మీడియాతో మాట్లాడారు. ఇన్నేళ్ళుగా తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం చెబుతూ, ”నేను సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి…
‘దళం’, ‘జార్జ్ రెడ్డి’తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఆకాష్ పూరి హీరోగా తీసిన సినిమా ‘చోర్ బజార్’. గెహనా సిప్పీ నాయిక. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ‘నా గత చిత్రాలైన దళం, జార్జ్ రెడ్డికి భిన్నంగా పూర్తి ఎంటర్ టైన్ మెంట్ తో తీసిన చిత్రమిది. బ్లడ్ షెడ్ లేకుండా…
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ నటించిన సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయికగా నటించిన ఈ సినిమాను ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవల…
పూరి తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయిక. దళం, జార్జ్ రెడ్డి సినిమాల దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమా తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్సికుతున్నిన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. తీరిక లేని షెడ్యూల్స్ లో తమ సినిమా ట్రైలర్ విడుదల…
యువ నటుడు ఆకాష్ పూరి, క్రియేటివ్ డైరెక్టర్ జీవన్ రెడ్డిల కాంబోలో రూపొందిన ఒక న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా “చోర్ బజార్” థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మేకర్స్ ఇప్పుడు సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. “చోర్ బజార్” టైటిల్ సాంగ్‌ని ఈరోజు ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేశారు. “చోర్ బజార్ టైటిల్ సాంగ్ “కిక్కాస్”… ఈ ప్రత్యేకమైన సాంగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్వాగ్, ఉల్లాసమైన ట్యూన్ తో ఆకట్టుకుంటుంది. ర్యాప్ పోర్షన్…
ప్రముఖ దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన సినిమా ‘రొమాంటిక్’. మూడేళ్ళ క్రితం ఆకాశ్ తో పూరి స్వీయ దర్శకత్వంలో ‘మెహబూబా’ చిత్రం నిర్మించారు. అది చేదు అనుభవాన్ని ఇవ్వడంతో ఈసారి కథ, చిత్రానువాదం, సంభాషణలు మాత్రం తాను అందించి, మెగా ఫోన్ ను అనిల్ పాదూరి చేతికిచ్చారు. ‘మెహబూబా’ను నిర్మించిన పూరి, ఛార్మినే ‘రొమాంటిక్’నూ తీశారు. కరోనా కారణంగా విడుదలలో చాలానే జాప్యం జరిగి, ఎట్టకేలకు ఈ ‘రొమాంటిక్’ శుక్రవారం జనం ముందుకు…