Hero Akash Puri becomes Brand Ambassador for RC Trendsetters clothing brand: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి. ఆకాష్ పూరి ‘మెహబూబా’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ యంగ్ హీరో “రొమాంటిక్” అనే కొత్త సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా వర్కౌట్ కాకపోవడంతో చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Ananya Nagalla: క్యాస్టింగ్ కౌచ్ పై అనన్య నాగళ్ల సంచలన వ్యాఖ్యలు

ఇక ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్లాత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ బ్రాండింగ్ కోసం స్టైలిష్ ఫొటో షూట్ చేశాడు ఆకాష్ పూరి. ఈ కొత్త లుక్ లో ఆకాష్ పూరి ఆకట్టుకునేలా ఉన్నాడు. సోషల్ మీడియాలో కూడా ఆకాష్ పూరి న్యూ లుక్ ఫోటో షూట్ స్టిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ క్రేజీ మెన్స్ క్లాత్ బ్రాండింగ్ గా పేరు తెచ్చుకుంటోంది. త్వరలోనే ఆకాష్ పూరి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేయబోతున్నాడు.
