NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Viral Video : శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరద్ పవార్ ఠాక్రేను గది నుంచి బయటకు వెళ్లమని అడుగుతున్నారని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
Sunetra Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కి రూ. 25,000 కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు.
Ajit Pawar: ఈ లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబధాల గురించి కాదని, ఇది ప్రధాని నరేంద్రమోడీకి రాముల్ గాంధీకి జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటో, పేరు ఉపయోగించొద్దని ఎన్సీపీకి న్యాయస్థానం ఆదేశించింది.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లను మార్చి 2న లంచ్కి రావాల్సిందిగా ఆహ్వానించారు. తన సొంత ప్రాంతం బారామతిలోని తన నివాసంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం పంపారు. శరద్ పవార్ రాజకీయ ప్రత్యర్థులైన వీరికి ఆహ్వానం పంపండం ప్రాధాన్యతన సంతరించుకుంది.
Ajit Pawar: దేశంలో మెజారిటీ ప్రజలు మరోసారి నరేంద్రమోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర అదికార కూటమిలో ప్రతీ ఒక్కరూ మోడీని గెలిపించడానికి పనిచేస్తున్నామని అజిత్ పవార్ ఆదివారం అన్నారు. బారామతిలో రైతుల ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ పార్టీలో చీలికలు వచ్చాయి. శరద్ పవార్, అజిత్ పవార్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల ఈసీ, మహారాష్ట్ర స్పీకర్ నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్దే అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవార్ కుటుంబంలో ఇద్దరు మహిళల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.