Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇగత్‌పురి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే హిరామన్ భికా ఖోస్కర్ అజిత్ పవార్ నేతృత్వంలోని-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఆయనతో పాటు అతని మద్దతుదారులు ముంబైలోని అజిత్ పవార్ నివాసంలో అధికారికంగా ఎన్సీపీలో చేరారు. ఈ సందర్భంగా భోస్కర్ కి కండువా కప్పి పార్టీలోకి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునీల్ తట్కరే ఆహ్వానించారు.
Read Also: Raptee.HV T30: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200కిమీ ప్రయాణం.. 8 సంవత్సరాల వారంటీ!
ఇక, హిరామన్ భికా ఖోస్కర్ ఎన్సీపీలో చేరడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాసిక్ దాని పరిసర ప్రాంతాల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. నాసిక్ ప్రాంతంలో ముఖ్యంగా గిరిజన సమాజంలో ఖోస్కర్‌కు చాలా మద్దతు ఉంది అని అజిత్ పవార్ పేర్కొన్నారు. భోస్కర్ తో పాటు సందీప్ గోపాల్ గుల్వే, సంపతనన సకాలే, మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు జర్నాదన్ మామ మాలి, మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు ఉదయ్ జాదవ్, వినాయక్ మాలేకర్, జైరాం దండే, ప్రశాంత్ కడు, పండుమామ షిండే, జ్ఞానేశ్వర్ కడు, జగన్ కదం, ఫిరోజ్ చా షేక్, దిలీప్ చౌద్ సహన్. రమేష్ జాదవ్, దశరత్ భాగ్డే, సుదమ్ భోర్, అరుణ్ గైకర్, శివాజీ సిర్సత్ కూడా ఎన్సీపీలో చేరారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీకి 288 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. భారత ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.
इगतपुरीचे आमदार आणि आदिवासी समाजाचे नेते श्री. हिरामण खोसकर यांनी आज राष्ट्रवादीचे विकासाभिमुख विचार स्वीकारत माझ्या आणि प्रदेशाध्यक्ष खा. सुनील तटकरे यांच्या उपस्थितीत आपल्या प्रमुख सहकाऱ्यांसह राष्ट्रवादी काँग्रेस पक्षात प्रवेश केला. आमदार खोसकर यांचा पक्षप्रवेश म्हणजे… pic.twitter.com/iYO5e6oLcS
— Ajit Pawar (@AjitPawarSpeaks) October 14, 2024