Ajit Pawar Warns Voters: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిధుల సమస్య అనేదే లేకుండా చేస్తాం, ఓటు వేయకుంటే మాత్రం, తామూ పట్టించుకోమని ఓటర్లను హెచ్చరించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణతో ఫోన్లో వాగ్వాదం పెట్టుకుని ఇరకాటంలో పడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా మరో మహిళా రైతుతో అజిత్ పవార్ వాగ్వాదం పెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు.
షోలాపూర్లో మహిళా ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణను ఫోన్లో బెదిరించారనే ఆరోపణలతో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆ వీడియోపై విమర్శలు గుప్పించారు. మహిళా గౌరవంపై పవార్ చేసిన ప్రకటన, ఐపీఎస్ అధికారిపై దర్యాప్తు జరపాలని ఆయన పార్టీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి చేసిన డిమాండ్ పరస్పర విరుద్ధమని ఆమె అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మహిళా…
ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ సర్టిఫికెట్లపై యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) విచారణ జరపాలని ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) మహారాష్ట్ర శాసన మండలి సభ్యుడు అమోల్ మిత్కారి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు సంబంధించిన వైరల్ వీడియో వివాదం తర్వాత ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై మిత్కారి సెప్టెంబర్ 5, 2025న న్యూఢిల్లీలోని యూపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాశారు. ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ సమర్పించిన విద్యా,…
ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టారు ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. దీంతో ఆమెకు కాల్ చేసి ఆ చర్యలను వెంటనే…
Meat Shops Closed: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో మాంస విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.
మాంసం అమ్మకాల నిషేధంపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతోంది. ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా.. ఆగస్టు 20న జైన పండుగ పర్యుషణ్ పర్వ సందర్భంగా కబేళాలు, మాంసం దుకాణాలు మూసేయాలని ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.
Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు.
Maharashtra: మహారాష్ట్రలోని బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్నాథ్ షిండే శివసేనల కూటమి ‘‘మహాయుతి’’లో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు. రాయ్గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా ఇద్దరు ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం…