Maharashtra: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ కూటమి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. 288 స్థానాలు ఉన్న మహా అసెంబ్లీలో బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)-శివసేన(షిండే) పార్టీలు ‘మహాయుతి’ పేరుతో కూటమిగా పోటీ చేయబోతున్నాయి.
Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహాయుతి కూటమిలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, శివసేన(ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీలు పొత్తులో ఉన్నాయి.
Helicopter Incident: మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు తృటిలో హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలోని మారుమూల జిల్లా గడ్చిరోలిలో స్టీల్ ప్రాజెక్టుకు శంకుస్థాపనకు వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని, తప్పిపోయింది.
RSS: మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కూటమికి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీకి సొంతగా మెజారిటీ రాకపోవడానికి పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఘోరమైన ప్రదర్శనకు అజిత్ పవార్ ఎన్సీపీనే కారణమని ఆర్ఎస్ఎస్ విమర్శించింది.
శుక్రవారం మహారాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా నష్టపోయింది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో డీలా పడింది.
Modi Cabinet: మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఇలా ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ మోడీ రికార్డ్ సృష్టించారు. ఈ సారి ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాలకు మోడీ కేబినెట్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన ఇలా ఎన్డీయే మిత్రపక్షాలకు కేబినెట్లో చోటు దక్కింది.
Pune Rains : మహారాష్ట్రలోని పూణే నగరంలో రుతుపవనాలకు ముందు వర్షాలు ప్రజలకు వేడి నుండి ఉపశమనం కలిగించాయి. అయితే తొలివానకే నగరంలో చాలా చోట్ల నీటి ఎద్దడి కూడా కనిపించింది.
Maharastra : రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కనిపించవచ్చు. లోక్సభ ఎన్నికల్లో శరద్పవార్ బలం పుంజుకున్న తర్వాత ఇప్పుడు అజిత్ పవార్ శిబిరం వెనకడుగు వేసింది.
ఇదిలా ఉంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా దారుణ ఫలితాలను చవి చూసింది. చివరకు బారామతిలో భార్య సునేత్రా పవార్ని కూడా గెలిపించుకోలేకపోయాడు. 05 స్థానాల్లో పోటీ చేసి ఒకే స్థానంలో గెలిచాడు. ఈ పరిణామాల తర్వాత ఈ రోజు ఎన్సీపీ కీలక సమావేశం జరిగింది.