గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది.. తన సొంత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓటుహక్కు వినియోగించుకున్నారు.. అహ్మదాబాద్‌లోని రణిప్ ప్రాంతంలో ఉన్న నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో తన ఓటు వేశారు మోడీ… ప్రత్యేక భద్రత మధ్య ఓటింగ్ కేంద్రానికి చేరుకుంది మోడీ కాన్వాయ్.. ఇక, తన వాహనం దిగి నడుచుకుంటూ వెళ్లిన ఆయన.. సామాన్య ఓటరుగానే మిగతా ఓటర్ల మధ్య క్యూలైన్‌లో వెళ్లి ఓటు వేశారు.. ఇక, ప్రధానిని చూసేందుకు…
ఐ లవ్ యూ ‘రస్నా’ అనే యాడ్ గుర్తుకుందా.. ఓ ప్రముఖ పానీయం పేరు అది.. అయితే, ఇప్పుడు రస్నా వ్యవస్థాపక చైర్మన్ అరీజ్ పిరోజ్‌షా ఖంబట్టా కన్నుమూశారు.. గుండెపోటుతో అహ్మదాబాద్‌లో మరణించినట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది.. దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 85 ఏళ్ల అరీజ్ పిరోజ్‌షా.. ఈ నెల 19వ తేదీన తుదిశ్వాస విడిచారు.. ఆయనకి భార్య పెర్సిస్ మరియు పిల్లలు పిరుజ్, డెల్నా మరియు రుజాన్.. కోడలు బినైషా మరియు మనవళ్లు అర్జీన్,…
National Games: అహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌లోని వడోదరకు చెందిన 10ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మల్లఖంబ్ క్రీడల్లో బాలుడి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శౌర్యజిత్ విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుజరాత్ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో…
భారత్‌లోని అన్ని ప్రాంతాల క్రీడాకారులు పోటీపడే సమయం ఆసన్నమైంది. దేశంలోని అత్యుత్తమ అథ్లెట్ల మధ్య క్రీడా సమరం నేటి నుంచి జరగనుంది. గుజరాత్‌లో గురువారం 36వ జాతీయ క్రీడలను నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.
Ahmedabad: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇప్పటికే దేశంలో ఐకానిక్‌గా నిలిచింది. సబర్మతి నదీ తీరంలో ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అహ్మదాబాద్‌కు మరింత వన్నె తచ్చింది. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రైల్వేస్టేషన్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరల్డ్ క్లాస్ వసతులతో అలరారుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లో నిర్మించనున్న వరల్డ్…
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆప్ కార్యాలయంలో గుజరాత్ పోలీసులు ఆదివారం సాయంత్రం సోదాలు చేసి ఏమీ కనుగొనకుండా వెళ్లిపోయారని ఆప్ నేతలు ఆరోపించారు. అయితే అహ్మదాబాద్ పోలీసులు మాత్రం అలాంటి దాడులు చేయలేదని కొట్టిపారేశారు.
ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును ఇండియాలోని ఓ వ్యక్తిలో గుర్తించారు. గుజరాత్‌కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తితో ఈఎంఎం నెగటివ్ బ్లడ్ గ్రూపును గుర్తించారు. ఇది ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్. ప్రపంచంలో ఇప్పటి వరకు 10 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూపును గుర్తించారు. తాజాగా తొలిసారిగా ఇండియాలో గుర్తించారు. సాధారనంగా మనకు ఏ, బీ, ఓ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉంటాయి. మొత్తం మానవశరీరంలో 42 రకాల బ్లడ్ సిస్టమ్స్…
ఈ ఏడాది డిసెంబర్ లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మరోసారి అధికారం చేజిక్కించుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల హార్దిక్ పటేల్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకుంది. ఎన్నికలకు సంబంధించి సన్నద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు బీజేపీకి కొత్త చిక్కు వచ్చిపడింది. పటేల్ సామాజిక వర్గం అహ్మదాబాద్ లోని…