National Games: అహ్మదాబాద్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో గుజరాత్‌లోని వడోదరకు చెందిన 10ఏళ్ల బాలుడు శౌర్యజిత్ ఖైరే చరిత్ర సృష్టించాడు. మల్లఖంబ్ క్రీడల్లో కాంస్య పతకం సాధించి జాతీయ క్రీడల్లో పతకం గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మల్లఖంబ్ క్రీడల్లో బాలుడి విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శౌర్యజిత్ విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుజరాత్ సంప్రదాయ క్రీడ అయిన మల్లఖంబ్‌కు ఇటీవలే జాతీయ క్రీడల్లో స్థానం కల్పించారు.
Read Also: IPhone 5G Update: డిసెంబర్ నాటికి అన్ని ఐఫోన్ మోడళ్లలో 5జీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్
గమనించాల్సిన విషయం ఏంటంటే.. శౌర్యజిత్ ఖైరే జాతీయ క్రీడలకు సిద్ధమవుతున్న సమయంలో సెప్టెంబర్ 30న తన తండ్రిని కోల్పోయాడు. దీంతో జాతీయ క్రీడల నుంచి వైదొలగాలని శౌర్యజిత్ ఖైరే భావించాడు. అయితే ఖైరే తల్లి, కోచ్ అతని తండ్రి జ్ఞాపకార్థం జాతీయ క్రీడల్లో పాల్గొని పతకం సాధించాలని ప్రోత్సహించారు. దీంతో జాతీయ క్రీడలకు ఖైరే హాజరై తన సత్తా చాటాడు. అక్టోబర్ 8న ఖైరే తదుపరి రౌండ్‌కు హాజరయ్యే ముందు తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేయడానికి ఇంటికి వెళ్లాడు. శౌర్యజిత్ వయసు 10 ఏళ్లే అయినా ఆకట్టుకునే శరీర కదలికలతో అతడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుండటం విశేషమనే చెప్పాలి.
10-year-old Shauryajit Khaire from Gujarat wins Bronze Medal 🥉 in Mallakhamb(Individual Pole); Becomes the youngest Medalist at the #36thNationalGames
#Mallakhamb #NationalGames2022 #Shauryajit @Media_SAI @ianuragthakur pic.twitter.com/Oa1OUHeRAj
— All India Radio News (@airnewsalerts) October 10, 2022