tag mahal : ప్రేమకు ప్రతిరూపం తాజ్ మహల్. అలాంటి అందాల పాలరాతి సౌధం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అందరూ భావిస్తున్నట్లు షాజహాన్ తాజ్ మహల్ ను కట్టించలేదంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. తన భార్యపై ప్రేమకు గుర్తుగా షాజహాన్ దీనిని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దాని పుట్టుపుర్వోత్తరాలను కనుగొనడానికి ప్రత్యేక కమిటీ నియమించాలంటూ డాక్టర్ రజనీష్ సింగ్ అనే వ్యక్తి దేశ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విదేశీ దురాక్రమణదారులు నిర్మించిన వాటిని చారిత్రక కట్టడాలుగా ప్రకటించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు.
Read also: Kerala: కేరళలో దృశ్యం సీన్ రిపీట్.. బీజేపీ కార్యకర్త శవాన్ని గోడలో పెట్టి ప్లాస్టరింగ్
తాజ్‌మహల్‌ను ఎవరు కట్టారంటూ పిటిషనర్ గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌ను సమాచార హక్కు కింద వివరాలు అడిగారు. అందుకు ఆ సంస్థ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. షాజహాన్ తన భార్య సమాధిగా తాజ్‌మహల్‌ను నిర్మించినట్లు చెప్పే ఆధారాలు లేవని పేర్కొంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ కూడా తన ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో లేదంటూ ఆయన కోర్టుకెక్కారు. తాజ్‌మహల్ నిర్మాణం 1653లో పూర్తయిందని ప్రచారంలో మాత్రమే ఉందని, అందుకు ఆధారాలు లేవనని ఆయన వాదిస్తున్నారు. తాజ్ మహల్ తేజో మహాలయం అనే శివాలయమని, దానికింద హిందూ కట్టడాలు ఉన్నాయంటూ ఇదివరకు కూడా పిటిషన్లు దాఖలు కావడం, ఆ సమాధిలో అలాంటివేమీ లేవని ఏఎస్ఐ చెబుతుండడం తెలిసిందే.
Read also:khiladi lady: ఏడుగురిని పెళ్లాడిన కిలాడీ లేడి
తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించినట్లు రుజువు చేయడానికి ప్రాథమిక ఆధారాలు లేవని పిటిషనర్ డాక్టర రంజనీశ్ అలహాబాద్ కోర్టులో మొదట పిటిషన్ వేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రంజనీశ్ లేవనెత్తిన అంశం న్యాయపరంగా నిర్ణయించదగినది కాదని కొట్టేసింది. దీంతో తాజ్ మహల్ నిర్మాణంపై వాస్తవాలు తెలపాలని రంజనీశ్ సుప్రీంకోర్టును కోరారు. తాజమహల్ నిర్మాణంపై వాస్తవాలు తెలుపాలని, ఇందుకు నిజ నిర్ధారణ కమిటీ వేయాలని రంజనీశ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, పిటిషనర్ అలహాబాద్ కోర్టులో తాజ్‌మహల్‌లోని 22 గదుల సీలింగ్‌ను తొలగించాలని, తాజ్‌మహల్‌ను చారిత్రక కట్టడంగా ప్రకటించడాన్ని సవాలు చేయాలని కోరారు. సుప్రీం కోర్టులో మాత్రం తాజ్ మహల్ చరిత్రను అధ్యయనం చేయడానికి ఒక వాస్తవ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని మాత్రమే కోరాడు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.