PM Modi: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తల్లి హీరాబెన్ ను చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి, ఆమెకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే 100వ పడిలోకి అడుగుపెట్టిన హీరాబెన్ శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 80 నిమిషాలకు పైగా ఆసుపత్రిలో ఉన్న ప్రధాని రాత్రిపూట నగరంలోనే ఉండే అవకాశం ఉంది. ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన హీరాబెన్ మోడీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Omicron BF7: కరోనా మందుల కోసం కొట్టుకుంటున్న చైనీయులు
మరికొద్ది రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రాత్రికి ప్రధాని అహ్మదాబాద్‌లో బస చేయనున్నారు. ఇవాళ ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆస్పత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మైసూరు-నంజన్‌గూడు హైవేపై ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రమాదానికి గురయ్యారు. ప్రహ్లాద్, అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరిన ఒక రోజు తర్వాత హీరాబెన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రహ్లాద్ మోదీ తన భార్య, కొడుకు, కోడలు, మనవడితో కలిసి మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదు.