ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వీలైతే ఎలాగైనా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఏదోక విమానం ఎక్కి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇక, ఆగస్టు 31 వరకు తాలిబన్లు ఎయిర్‌పోర్టులోని అమెరికా, నాటో దళాలకు డెడ్‌లైన్ విధించారు. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వారంతా వెళ్లిపోవాలని షరతు విధించారు. అందుకు తగ్గట్టుగానే అమెరికా, నాటో దళాలు ప్రజలను తరలిస్తున్నాయి. అయితే, వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్‌పోర్టుకు కొత్త వ్యక్తులు…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా సామాన్య ప్రజలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. కాల్పులు జరుపుతున్నారు. శాంతి మంత్రం వల్లెవేస్తూనే, అరాచకాలు సృష్టిస్తున్నారు. మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే విదేశీ మీడియా సంస్థలు, ప్రతినిధులు, జర్నలిస్టులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఉన్న మీడియా క్షణక్షణం భయం భయంగా వార్తలను అందిస్తోంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని చేస్తున్నప్పటికీ వారి అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా, స్థానిక…
తాలిబన్లు రెండోసారి ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. 1994లో మొదటిసారి తాలిబన్లు ఆఫ్ఘన్ దురాక్రమణకు పూనుకోవడం, 1996లో అధికారంలోకి రావడంతో ఆక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రమే కాకుండా పాక్‌లోనూ తాలిబన్లు వారి ఉనికిని చాటుకున్నారు. 9 ఏళ్ల క్రితం తాలిబన్లు పాక్‌లోని క్వెట్టా ప్రాంతంలోకి ప్రవేశించి స్కూల్ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విద్యార్ధిని మలాలా యూసెఫ్జాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత ఆమెను పెషావర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి…
ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్.. అక్కడ తాలిబన్ల పాలనపైనే ఉంది. ఈసారి ఇండియాలో ఉన్న తాలిబన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లో తాలిబన్ క్రికెట్ క్లబ్ పేరుతో ఓ టీమ్ ఉంది. ఆ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఉన్న భనియానా గ్రామంలో జరుగుతున్న టోర్నీలో ఈ క్లబ్ ఓ మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆ తర్వాత ఈ క్లబ్ పేరుపై వివాదం చెలరేగడంతో… నిర్వాహకులు ఆ టీమ్‌పై నిషేధం విధించారు. అసలు టోర్నీలో ఈ టీమ్‌ను…
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్ పైనే ఉంది. అయితే తాలిబన్ల సమస్యతో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ కు ఆఫ్ఘన్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీలో ఆ జట్టు పాల్గొంటుందా.. లేదా అని అనుకుంటున్న సమయంలో తాలిబన్లు అందరికి షాక్ ఇచ్చారు. తాజాగా ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అలాగే క్రికెట్ బోర్డు సభ్యులతో తాలిబన్ అధ్యక్షుడు…
ఆఫ్ఘనిస్తాన్‌లో అరాచక పాలన మొదలైంది. శాంతి మంత్రం జపిస్తూనే తాలిబన్లు తమ మార్క్ హింసను చూసిస్తున్నారు. దేశం విడిచిపారిపోవాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ వైపు వెళ్లేవారిపై దాడులు చేయడం, కాల్పులు జరపడం చేస్తున్నారు. గత ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు తాలిబన్లు. ఇక మహిళల విషయంలో తాలిబన్లు ఎంతటి కౄరంగా ప్రవర్తిస్తారో వేరే చెప్పక్కర్లేదు. మహిళలు ఒంటరిగా బయటకు వస్తే వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే గ్యారెంటీ…
నిన్న ఆపఘనిస్తాన్ నుంచి భారతదేశానికి తరలించిన 78 మందిలో 16 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా, మొత్తం 78 మందిని ఐసోలేషన్ లో ఉంచారు అధికారులు. తాలిబాన్ ల ఆక్రమణ తర్వాత మరింత దిగజారుతుంది అక్కడి భద్రతా పరిస్థితి. భారత్ పౌరులతో పాటు, ఆఫ్ఘనిస్తాన్ ను వీడిపోవాలనుకుంటున్న ఆదేశ పౌరులను సైతం తరలించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది భారతదేశం. ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుండి 228 మంది భారతీయ పౌరులతో…
తాలిబన్ల శకం ఆరంభం అయినప్పటి నుంచి పంజ్‌షీర్ ప్రావిన్స్ వారికి కొరకరాని కొయ్యగా మారింది. 1994 ప్రాంతంలో కూడా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నప్పటికీ పంజ్‌షీర్ మాత్రం వారికి దొరకలేదు. అప్పటి నుంచి అక్కడి స్థానిక సాయుధులు తాలిబన్లతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాగా, ఇప్పుడు కూడా తాలిబన్లతో పంజ్‌షీర్ సేనలు పోరాటం చేస్తున్నాయి. పంజ్‌షీర్ సేనలు 6 వేల వరకు ఉండగా, తాలిబన్ల సైన్యం అపారంగా ఉంది. పైగా వారివద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్…
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చెరలో ఉండిపోయింది. ఒక్క పంజ్‌షీర్ ప్రావిన్స్ మినహా మొత్తం తాలిబన్ల వశం అయింది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘన్ అధికారులు ఓ విషయంపై ఆందోళనలు చెందుతున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని జ్వాజియన్ ప్రావిన్స్ లో తిల్యాతోపే అనే ప్రాంతంలో పెద్ధ ఎత్తున నిధులు బయటపడ్డాయి. సోవియట్ యూనియన్ ఆధీనంలో ఆఫ్ఘన్ ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 20,600 వరకు వస్తువులు బయటపడ్డాయి. నాణేలు, ఇతర వస్తువులు వంటివి…
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాలిబన్ల ఆక్రమణలతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. మళ్లీ 1996 నాటి పరిస్థితులు వస్తాయని భయపడుతున్నారు. భయపడినట్టుగానే జరుగుతున్నది. శాంతి మంత్రం జపిస్తూనే కాల్పులకు తెగబడుతున్నారు. మహిళలపై విరుచుకుపడుతున్నారు. ఎలాగైనా తప్పించుకొని దేశం దాటిపోవాలని చూస్తున్నవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు కాబూల్‌లో మరో సంఘటన జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన విమానాన్ని దుండగులు హైజాక్ చేశారు. విమానం హైజాక్ అయినట్టు…