ఆఫ్ఘనిస్తాన్‌లోని పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో మళ్లీ ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. పంజ్‌షీర్ ప్రావిన్స్ ఇప్పటి వరకు తాలిబన్ల వశం కాలేదు. ఆ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వబోమని అక్కడి సైన్యం చెబుతున్నది. అయితే, ఎలాగైనా ఆక్రమించుకోవాలని తాలిబన్లు పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో తిరుగుబాటుదారుల కోసం తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. దీంతో పంజ్‌షీర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడింది. పంజ్‌షీర్ సైన్యం దాడిలో 300 మంది తాలిబన్లు హతం అయినట్టు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా దృవపరిచింది. ఇది తాలిబన్లకు ఎదురుదెబ్బ అని చెప్పాలి. పంజ్‌షీర్ ఇచ్చిన స్పూర్తితో మిగతా ప్రావిన్స్‌లలో కూడా స్థానిక బలగాలు తాలిబన్లపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
Read: అప్పటి వరకూ మాస్క్ పెట్టుకోక తప్పదా…!!