ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు.. అయితే, కాబూల్ ఎయిర్‌పోర్ట్ లాంటి ప్రాంతాల్లో ఇంకా అమెరికా సైన్యం ఆధీనంలోనే ఉన్నాయి… అ నేపథ్యంలో అమెరికాకు డెడ్‌లైన్ పెట్టారు తాలిబన్లు… ఆఫ్ఘన్ గడ్డపై నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించేందుకు అమెరికా.. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పెట్టింది.. అయితే, అమెరికా పెట్టుకున్న ఆ గడువు పెంచితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు తాలిబన్లు.. ఆగస్టు 31 డెడ్‌లైన్.. అమెరికా బలగాల ఉపసంహరణకు ‘రెడ్ లైన్’ అంటూ వ్యాఖ్యానించారు తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షమీన్.. అమెరికా గానీ, ఇంగ్లండ్ గానీ ఆఫ్ఘన్‌ను ఖాళీ చేయాల్సిందేనని పేర్కొన్నారు.