తాలిబన్లకు అన్ని విధాలుగా సహకరిస్తోంది పాకిస్థాన్. అఫ్ఘాన్ ఆర్మీతో పోరులో తాలిబన్లకు సహకరించాయి పాక్ ఉగ్రవాద సంస్థలు. అఫ్ఘాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక POK తిరిగి వచ్చాయి ఆ ఉగ్రమూకలు. ఈ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ బయటకు వచ్చాయి. దీంతో తాలిబన్లకు.. తమ చెప్పుచేతల్లో ఉండే ఉగ్ర సంస్థల ద్వారా సహకారం అందించింది పాక్. పైకి అమెరికాకు సహకరిస్తున్నట్లే ఉన్నా.. లోలోపల మాత్రం తాలిబన్లకు సహకరించింది. ఈ విజువల్స్ ద్వారా.. పాక్ పన్నాగం బయటపడింది. ఉగ్రవాదులు తిరిగివచ్చినప్పుడు..లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు మద్దతుగా POKలో పలుచోట్ల ర్యాలీలు జరిగాయి.
ఇది ఇలా ఉండగా….అల్లకల్లోలంగా మారిన అప్ఘానిస్తాన్ నుంచి భారతీయుల తరలింపు వేగంగా కొనసాగుతోంది. తాజాగా మరో 75 మందిని కాబూల్ ఎయిర్ పోర్టునుంచి భారత్‌కు తలించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో వీరిని భారత్‌కు తీసుకొస్తున్నారు. ఇందులో 46 మంది అప్ఘానీ సిక్కులు, హిందువులు కూడా ఉన్నారు. అప్ఘానిస్తాన్‌లోని వివిధ గురు ద్వారాల నుంచి వీరిని ప్రత్యేక వాహానాల్లో ఉదయం కాబూల్ ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో వారిని భారత్‌కు తరలించారు.