బాల్యంలో మనల్ని ప్రభావితం చేసే అంశాలే వారి జీవితాల్ని నిర్ధేశిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజల జీవన విధానం ఎలా మారిపోయిందో చెప్పక్కర్లేదు. తాలిబన్లనుంచి తప్పించుకొని పొట్ట చేతపట్టుకొని పిల్లలతో కలిసి దొరికిన విమానం పట్టుకొని శరణార్ధులుగా వివిధ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆఫ్ఘనిస్తానీయులకు ఆశ్రయం ఇస్తున్న దేశాల్లో బెల్జియం కూడా ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక మంది శరణార్ధులుగా బెల్జియంకు వెళ్తున్నారు. అక్కడ ఆర్మీ ఏర్పాటు చేసిన క్యాంప్‌లలో నివశిస్తున్నారు. ఇలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బెల్జియం చేరుకున్న ఓ చిన్నారి…
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆగస్టు 15 ముందు వరకు ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నది. ఆగస్టు 19 వ తేదీ ఆఫ్ఘన్‌కు స్వాతంత్య్రం వచ్చిన రోజు. ఆ రోజుకు ముందే తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారు. ఆగస్టు 31 లోగా అమెరికా బలగాలు ఉపసంహరించుకోవాలని ఇప్పటికే తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఇదే సమయంలో ఐసిస్ ఉగ్రవాదులు కాబూల్‌లోని ఎయిర్‌పోర్ట్‌పై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆఫ్ఘన్‌ను తాలిబన్లకు అప్పగిస్తే అక్కడ తిరిగి స్థానిక…
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ సహా చాలా ప్రాంతాలు తాలిబన్ల వశం అయిన తర్వాత కూడా హింస సాగుతోంది.. వరుసగా బాంబు పేలుళ్లు కాబూల్ వాసులను వణికిస్తున్నాయి.. ఇప్పటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ఐసిస్ జరిపిన దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 180 దాటిపోగా.. మరోసారి కాబూల్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది అమెరికా.. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద వచ్చే 36 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రాగల 24…
అతంర్యుద్ధంతో అల్లాడుతున్న ఆఫ్గనిస్తాన్ని మరో పెను ప్రమాదం వెంటాడుతోంది. అదే ఆకలి సంక్షోభం. లక్షలాది మంది చిన్నారులు ఆకలికి అలమటిస్తున్నారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గోధుమ, బియ్యం, చక్కెర , నూనె ధరలు సామాన్యుడు కొనుక్కునే పరిస్థితిలో లేడు. దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు…వలసలు..తాజాగా తాలిబాన్ సంక్షోభం. వెరసి ధరలకు రెక్కలొచ్చాయి. కరోనాకు ముందు ధరలతో పోలిస్తే 50 నిత్యావసర సరుకుల ధరలు శాతానికి పైగా పెరిగాయి.స్వచ్చంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్ తన…
అఫ్ఘానిస్థాన్ ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా డ్రోన్ దాడులు చేసింది. ఇస్లామిక్ శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసిన నేపథ్యం లో కాబూల్ విమానాశ్రయాన్ని ఖాలీ చేయాలని పౌరులను అమెరికా హెచ్చరించింది. ఇటీవల కాబూల్ విమానాశ్రయం వెలువల జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో 13 మంది అమెరికా సైనికులతో పాటు సుమారు 100 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా అగ్రరాజ్యం డ్రోన్ దాడులకు పాల్పడింది. కాబుల్ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లకు కారణమైన…
ఆఫ్ఘన్లో పరిస్థితులపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు కాల్పులు జరిపి… 9 ఏళ్లు పూర్తవుతున్నా… ఓ బుల్లెట్ గాయం నుంచి కోలుకోలేకపోతున్నానని మలాలా తెలిపారు. గత 40 సంవత్సరాలుగా దేశ ప్రజలు… లక్షల కొద్దీ బుల్లెట్లను ఎదుర్కొంటూనే ఉన్నారని వెల్లడించారు. ఆఫ్ఘన్లో తొలి ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలో మలాలాకు సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్ నుంచి ఇటీవలే కోలుకున్న ఆమె.. ప్రస్తుత ఆఫ్ఘన్ పరిస్థితులపై స్పందించారు. తాలిబన్ల చర్యలతో…
కాబూల్ బ్లాస్ట్ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 150 దాటిందని తెలుస్తోంది. మరికొంత మంది ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇటు కాబూల్ ఎయిర్ పోర్టుకు ఉగ్రవాదుల నుంచి మరోసారి ముప్పు పొంచి ఉందని అమెరికా సహా అనేక దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇటు బాంబు దాడుల భయం ఉన్నా జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎయిర్ పోర్టు గుంపులు గుంపులుగా తరలి వస్తూనే ఉన్నారు. ఇటు,…
అగ్రరాజ్యం అమెరికా, తాలిబన్లు ఒక్కటైపోయారా ? దళాల ఉపసంహరణ నిర్ణయం తర్వాత… తాలిబన్లు అమెరికా సైన్యానికి సహకరిస్తున్నారా ? నాటో దళాల తరలింపునకు… తాలిబన్లు దగ్గరుండి సాయం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద తాలిబన్లు… ప్రజలను అడ్డుకుంటున్నా… ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశాలకు వెళ్లేందుకు శరణార్థులుగా వచ్చిన వారిపై కాల్పులు జరిపినా… తమకేమీ తెలియనట్లు నటించారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా… పట్టించుకోలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పు మీద తప్పు…