తాలిబన్లు విధించిన డెడ్‌లైన్ మరో 48 గంటల్లో ముగియనున్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత అమెరికా బలగాలు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి పూర్తిగా తప్పుకోవాల్సి ఉన్నది. ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి తరువాత తాలిబన్లు కాబూల్ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆగస్టు 31 తరువాత కూడా తరలింపుకు అవకాశం ఇవ్వాలని అమెరికాతో సహా ఇతర దేశాలు తాలిబన్లను విజ్ఞప్తి చేసిప్పటికీ వారు అంగీకరించలేదు. దీంతో అమెరికా తక్షణమే పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే అనేక దేశాలు తమ ఎంబసీ కార్యాలయాను, ఎయిర్‌పోర్ట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. వేలాది మంది శరణార్ధులను వివిధ దేశాలకు తరలించారు. ఇంకా వేలాది మంది ప్రజలు ఎయిర్‌పోర్ట్ బయట లోపల నిరీక్షిస్తున్నారు. అమెరికా బలగాలు పూర్తిగా వెళ్లిపోయిన తరువాత ప్రజల పరిస్థితి ఎంటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాము మారిపోయామని, అందరికి సమానమైన హక్కులు ఇస్తామని, మహిళలను గౌవవిస్తామని చెబుతున్నా, ఇప్పటికే తాలిబన్లు వారి అరాచక పాలనకు శ్రీకారం చుట్టారు. తమకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. మహిళలు బయటకు రావొద్దని, టీవీ, రేడియోలలో మహిళల వాయిస్ అవసరం లేదని ఇప్పటికే హుకుం జారీ చేశారు. ఇక ఇదిలా ఉంటే, మహిళలు యూనివర్శిటీలలో చదువుకోవచ్చిని చెబుతూనే, మిక్సిడ్ విద్యకు తాము వ్యతిరేకమని చెబుతున్నారు. ఇక విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి చదువులు ఉంటాయి అనేది ఇంకా స్పష్టత రాలేదు. అమెరికన్లు ఖాళీ చేసి వెళ్లక ముందే ఆ దేశంలో తాలిబన్లకు వ్యతిరేక శక్తులైన ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఆత్మాహుతి దాడులు చేశారు. ఈకొద్ది సేపటి క్రితం కూడా దాడులు చేశారు. ఇక అమెరికా, నాటో దళాలు పూర్తిగా దేశాన్ని విడిచి వెళ్లిపోతే పాపాం ఆఫ్ఘన్ పరిస్థితి ఏంటి? ప్రజల తాలిబన్ల చేతిలో నలిగిపోవాల్సిందేనా…!!
Read: సరికొత్త ఆలోచన: ఆ గ్రామంలో సొంతంగా సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నారు…