ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. మొత్తం ఆరు ప్రదేశాల్లో దాడులు చేశారు. ఈ దాడిలో 100 మందికి పైగా మృతి చెందినట్టు ఆఫ్ఘన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడులకు పాల్పడింది తామే అని ఐఎస్ కే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐసిస్ ఖోరోసన్ ను ఐఎస్ కే గా పిలుస్తారు. ఐసిస్ ఖోరోసన్ అంటే ఏమిటి? తెలుసుకుందాం. 2014లో ఇరాక్, సిరియా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఖలీఫా ఏర్పడిన తరువాత, పాకిస్తాన్‌కు…
అమెరికాతో పాటుగా అనేక అగ్రరాజ్యాలు కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. అలా హెచ్చరించిన గంటల వ్యవధిలోనే దాడులు జరిగాయి. అంటే అక్కడ సెక్యూరిటి ఏ విధంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. తాలిబన్ల ఆక్రమణల తరువాత ఆ దేశం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తాలిబన్ ఫైటర్లు మాత్రమే భద్రతా సంబంధమైన విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు, సైనికులు ఇంకా విధుల్లోకి రాలేదు. దీంతో భద్రతా పరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. అగ్రదేశాల నిఘాచారాన్ని…
ఆఫ్ఘన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయిన తరువాత తాలిబన్ల పాలనలోకి వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో అధికారుల బదలాయింపు ప్రక్రియ పూర్తికాలేదు. అధికార బదలాయింపు పూర్తికాకుండానే అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లే ఇందుకు కారణం. ఆఫ్ఘన్లో భద్రత ఏ స్థాయిలో ఉన్నదో నిన్నటి సంఘటనతో తేలిపోయింది. తాలిబన్లకు పాలన అప్పగిస్తే ఐసిస్, అల్‌ఖైదా వంటి అంతర్జాతీయ నిషేదిత ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత యుద్దాలతో,…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్ల ఆక్రమణ తరువాత అక్కడ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలను గౌరవిస్తామని తాలిబన్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలా జరగడంలేదు. మహిళలను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నారు. ఒంటరిగా బయటకు వస్తున్న మహిళలను తాలిబన్ ఫైటర్లు హింసిస్తున్నారు. దీనిపై తాలిబన్ నేతలు ఓ వింత ప్రకటన చేశారు. తమ ఫైటర్లకు ఇంకా మహిళలను గౌరవించడం తెలియడం లేదని, వారికి త్వరలోనే మహిళలను ఎలా గౌరవించాలో నేర్పుతామని, అప్పటి వరకు ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇంటి నుంచి బయటకు రావొద్దని…
ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తరువాత అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వెళ్లాలని తాలిబన్లు ఇప్పటికే అమెరికా దళాలను ఆదేశించారు. ఇక ఇదిలా ఉంటే, నిన్నటి రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, కాబూల్ ఎయిర్‌పోర్టు వైపు ఎవరూ రావొద్దని అగ్రదేశాల నిఘా సంస్థలు హెచ్చరించారు. ఈహెచ్చరికలు జరిగిన గంటల వ్యవధిలోనే కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద రెండు బాంబుదాడులు జరిగాయి. ఈ దాడిలో 72 మంది మృతి చెందగా, 140…
కరుడు గట్టిన తాలిబన్ల తీరు మారుతుందా? ఇకనైనా పద్దతి మార్చుకుంటారా? మాటకు కట్టుబడి ఉంటారా! అలా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? చస్తే నమ్మరు. తాలిబన్ల ట్రాక్ రికార్డ్ అటువంటిది మరి. అందుకే ఆఫ్గనిస్తాన్ పొరుగు దేశాల్లో గుబులు మొదలైంది. ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే ఆ భయం లేదు. తాలిబాన్ అనే పాముకు పాలు పోసి పెంచింది అదే కదా! తాలిబన్ల విజయం చూసి పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది. కానీ .. ఏదో ఒక రోజు దానిని కూడా…
ఆఫ్ఘనిస్తాన్ పై అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ… ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావాలని కోరాం. ఆఫ్ఘనిస్థాన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైంది. తాలిబన్లతో చర్చలు జరిపి అందరిని క్షేమంగా తీసుకురావాలి అని పేర్కొన్నట్లు తెలిపారు. మన దేశం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి. భారతీయులను, పెట్టుబడులను కూడా పరిరక్షించాలి.…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతున్నది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వ్యాపార సంస్థలను తెరవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు వ్యాపారులు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. బడా వ్యాపారవేత్తలు అక్కడే ఉంటే ప్రాణాలతో ఉండలేమని చెప్పి ముందుగానే దేశం వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ఓ వ్యక్తి నిర్వహిస్తున్న వ్యాపారం దివ్యంగా సాగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అజీజ్ గ్రూప్‌కు మంచి…