ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం ఇంకా ముగియకముందే ఇప్పుడు అమెరికాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు మళ్లీ అణు సమస్యలు తెచ్చిపెట్టేందుకు సిద్ధం అయింది. అణు రియాక్టర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అటామిక్ ఏజెన్సీ పేర్కొన్నది. ఇది అంతర్జాతీయ అణుచట్టాలకు విరుద్ధమని ఐరాస పేర్కొన్నది. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తో సమావేశానికి ముందు యాంగ్‌బ్యోన్‌లోని అణు రియాక్టర్‌ను మూసివేశారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు మరలా ఈ అణు రియాక్టర్‌ను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఈ రియాక్టర్ల నుంచి అణ్వాయుధాల్లో వినియోగించే ఫ్లూటోనియంను తయారు చేస్తారు. రియాక్టర్లను వినియోగంలోకి తీసుకొచ్చినట్టుగా ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయని ఐరాస అటామిక్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇది అమెరికాకు పెద్ద విఘాతం అని చెప్పాలి. అమెరికాపై నిత్యం ఒంటికాలిపై లేచిపడే ఉత్తర కొరియాను కట్టడి చేయాల్సిన బాధ్యత పెద్దన్నగా అమెరికాపైనే ఉన్నది. ఇప్పటికే ఆఫ్ఘన్ విషయంలో తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అమెరికాలోని ప్రతిపక్షాలతో సహా ప్రపంచ దేశాలు విమర్శిస్తున్నాయి. మరి ఈ సమయంలో ఉత్తర కొరియా వినియోగంలోకి తీసుకొచ్చిన అణురియాక్టర్ విషయంలో అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Read: అన్ని వైరస్‌లకు ఒక్కటే వ్యాక్సిన్…