అమెరికా సేనలు వైదొలిగిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయింది. అమెరికా వెచ్చించిన లక్షల కోట్ల డాలర్లు బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆఫ్ఘన్ సైనికులు తాలిబన్లను సమర్థవంతంగా అడ్డుకుంటారని అందరూ అనుకున్నారు. కాని, వారు చేతులెత్తేయడంతో తక్కువ రోజుల్లోనే తాలిబన్లు కాబూల్‌ను చేరుకోవడం, కొన్ని తప్పుడు వార్తల ద్వారా ఘనీ ఆగమేఘాలమీద దేశాన్ని విడిచి వెళ్లడం జరిగింది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లడానికి కొన్ని రోజుల ముందు చివరి సారిగా బైడెన్‌తో…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాయి. పూర్తిగా సేనలు తప్పుకోవడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై ఉగ్రవాదుల దాడి తరువాత ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం ప్రకటించింది అమెరికా. సేనలు ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించి ఉగ్రవాదులను తరిమికొట్టాయి. 2001లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. 20 ఏళ్లపాటు ఆమెరికా రక్షణలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచింది. అమెరికా సేనలు ఉపసంహరించుకునే సమయానికి తిరిగి 2001 ముందునాటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 20 ఏళ్ల కాలంలో…
ఆగస్టు 31 వ తేదీ కంటే ముందే అమెరికా దళాలు ఆఫ్ఘన్‌ను వదిలి వెళ్లిపోయాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో చివరి సైనికుడితో సహా అందర్ని అమెరికా వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ రక్షణ కోసం అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేసి అధునాతన ఆయుధాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. వెళ్లే సమయంలో వీలైన్ని ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లిన అమెరికా, చాలా ఆయుధాలను ఆఫ్ఘన్‌లోనే వదిలేసింది. అయితే, వాటిని చాలా వరకు నిర్వీర్యం చేసింది. తిరిగి వినియోగించాలంటే దానికి తగిన టెక్నాలజీ,…
అమెరికా పారిపోయింది..! అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. ఈ సమయంలో తాలిబన్లతో ఇండియా చర్చలకు సిద్ధమైందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖతార్‌లోని దోహాలో తాలిబన్ పొలిటికల్ అఫైర్స్ చీఫ్ మహమ్మద్ అబ్బాస్‌తో భారత రాయబారి దీపక్ మిట్టల్ సమావేశమయ్యారు. అఫ్ఘానిస్తాన్‌లో ఉన్న భారతీయులను క్షేమంగా తిరిగి తీసుకొచ్చే అంశంపై చర్చించారు. దీంతో పాటు భారత్‌కి వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాదులకు, ఉగ్ర కార్యకలాపాలకు అఫ్ఘానిస్తాన్‌లో ఆశ్రయం కల్పించొద్దని దీపక్ మిట్టల్ స్పష్టం చేశారు.…
20 ఏళ్లుగా అమెరికా, నాటో దళాల సంరక్షణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా తప్పుకున్నాక తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్ల ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తాత్కాలిక శాఖలను ఏర్పాటు చేసి మంత్రులను నియమిస్తోంది. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాలిబన్లు ఎలా పరిపాలించబోతున్నారు అన్నది ఉత్కంఠంగా మారింది. తాలిబన్ల చెరలోకి ఆఫ్ఘన్ వెళ్లిన వెంటనే విదేశీ నిథులను అమెరికా ఫ్రీజ్ చేసింది.…
ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను అమెరికా దళాలు పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిన తరువాత ఎయిర్పోర్ట్ మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. రాత్రి తాలిబన్ దళాలు ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించాయి. ఈ తరువాత తాలిబన్లు తయారు చేసిన బద్రి 313 ఫోర్స్ దళాలు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లి అనువణువును గాలించాయి. తాలిబన్ నేతలు కార్లలో వెళ్లి పరిశీలిస్తే, కొంతమంది మాత్రం ఎయిర్‌పోర్ట్‌లోకి సైకిళ్లపై వెళ్లారు. ట్రాక్‌పై రౌండ్లు వేశారు. దీనికి సంబందించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ…
ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను ఆమెరికా పూర్తిగా ఖాళీచేసి వెళ్లిపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఎయిర్‌పోర్ట్‌ను పూర్తిగా ఖాళీచేసింది. చివరి సైనికుడితో అంతా ఎయిర్‌పోర్ట్‌ను వదలి వెళ్లిపోయారు. అనంతరం తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనంలోకి తీసుకున్నారు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతూ కేరింతలు కొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. తాలిబన్ నేతలు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారు. ఎయిర్పోర్ట్ మొత్తం కలియదిరిగారు. దేశంలోని ప్రజలందరినీ క్షమించేశామని, పౌరులను భద్రంగా…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. ఆగస్టు 15 న తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. అయితే, తాలిబన్లు కాబూల్ నగరంలోకి అడుగుపెట్టకముందే అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశాన్ని వదలి వెళ్లిపోయాడు. ఘనీ దేశాన్ని విడిచి వెళ్తూ కోట్లాది రూపాయలను, ఖరీదైన కార్లను తన వెంట తీసుకెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలను ఘనీ ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, కనీసం చెప్పులు తొడుక్కునే సమయం కూడా లేదని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఘనీ…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల దురాక్రమణలో ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలం అయింది. 2001 నుంచి 2021 వరకు ప్రజాస్వామ్య పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మరోసారి తాలిబన్ల వశం అయింది. దీంతో ఇప్పుడు మరలా తాలిబన్ల గురించి ప్రపంచం భయపడుతున్నది. ఆందోళన చెందుతున్నది. 1990లో తాలిబన్ల వ్యవస్థ ఏర్పాటైంది. గిరిజనుల హక్కుల పోరాటం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తాలిబన్ల వ్యవస్థను 1990లో ఏర్పాటు…