తాలిబన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఆగస్టు 15 వ తేదీన వారు ఆ దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఇది జరిగిన రెండ్రోజులకు తాలిబన్ కీలక నేతను టోలో న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఛానల్ న్యూస్ యాంకర్ బెహెస్తా ఆర్ఘాండ్ అనే యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. కాబూల్‌లో సోదాలు, భవిష్యత్ ప్రణాళికలు, మహిళలకు రక్షణ తదితర విషయాలపై ఆమె తాలిబన్ నేతను ప్రశ్నించింది. ఈ ఇంటర్వ్యూ పూర్తయ్యి ప్రసారం జరిగాక ఆ యాంకర్ మాయం అయింది. తాజా సమాచారం ప్రకారం, ఆ మహిళా యాంకర్ దేశం విడిచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. మహిళలకు ఆఫ్ఘన్‌లో రక్షణ లేదని, తాలిబన్లు చెప్పిన మాటపై నిలబడతారనే గ్యారెంటీ లేదని, అందుకే తాను దేశం విడిచి వెళ్లినట్టు సీఎన్ఎన్‌కు తెలిపింది. అయితే, ఇచ్చిన మాటపై తాలిబన్లు నిలబడి మహిళలకు గౌరవిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తే తప్పకుండా తిరిగి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్తానని బెహెస్తా పేర్కొన్నది.
Read: తాలిబన్లు అంటే అదే… తుపాకీ గురిపెడుతూనే… శాంతి వచనాలు…