ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని ఖోస్ట్ ప్రావిన్సుతో పాటు కునార్‌లోని షెల్టాన్ జిల్లాలో పాక్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు 30 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు .26 పాకిస్థాన్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. తాలిబన్ పోలీస్ చీఫ్ అధికార ప్రతినిధి ఈ దాడులను ధృవీకరించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడినట్లు ఆయన వెల్లడించారు.
ప్రధానంగా తీవ్రవాదులకు ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబాన్లు ఆశ్రయం ఇవ్వడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో వజీరిస్తాన్ నుంచి వలస వచ్చిన వారి శిబిరాలే లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడింది. పాకిస్థాన్ భూభాగంలోకి వచ్చే ఉత్తర వజీరిస్తాన్‌లోని ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులను వైమానిక దాడులతో మట్టుబెట్టినట్లు పాకిస్థాన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య 2,700 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ అని పిలిచే సరిహద్దు ఉంది. దీనిని ఆక్రమించుకునేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే వైమానిక దాడులపై ఇటు పాకిస్థాన్ ప్రభుత్వం కానీ అటు అప్ఘాన్ పాలకులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్.. ఇక ప్రమాదకరంగా మారుతా..!