ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు పాలన ప్రారంభించి 100 రోజులు పూర్తయింది. అమెరికా బలగాలు ఆప్ఘనిస్తాన్ నుంచి వెళ్లిపోవడంతో తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమ చేతుల్లో తీసుకుని పాలించడం మొదలుపెట్టారు. తాలిబన్లు అధికారంలోకి రావడంతో అఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబన్లు హరించివేస్తున్నారనే అపవాదు వచ్చింది. మీడియాపైనా తాలిబన్లు పలు రకాల ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో పలువురు పౌరులు దేశాన్ని విడిచి…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశానికి చెందిన నిధులను అమెరికా ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశం నిధుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఆగిపోయాయి. దేశంలో ఆహార సంక్షోభం తీవ్రంగా వేధిస్తున్నది. శీతాకాలంలో ఈ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. ఆహారం, ఉద్యోగ సమస్యలు తీవ్రంగా ఉండటంతో ఆఫ్ఘన్ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారు. శీతాకాలంలో ఈ వలసలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. దీంతో తాలిబన్…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉంటున్నాయి. ఆ దేశంలో ఉగ్రవాద శక్తులు బలం పుంజుకొని సాధారణప్రజలపై దాడులు చేస్తున్నారు. కొన్ని తెగల ప్రజలను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ రాజధానిలో వరసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కాబూల్‌లో ఓ బాంబుపేలుడు జరిగింది. Read: ఈజిప్ట్‌లో బయటపడిన సూర్యదేవాలయం… ఏ కాలానికి చెందినదో తెలుసా… ఉదయం జరిగిన పేలుడు సంఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరోచోట బాంబు పేలుడు జరిగింది.…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏ దేశం ఆ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. అయితే, అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో మానవతా దృక్పధంతో ప్రజలను ఆదుకోవడానికి అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. అందులో ఇండియా ప్రధమంగా ఉన్నది. ఇండియా చొరవతీసుకొని అక్కడి ప్రజలకోసం ఆహారధాన్యాలు ఇతర సహాయ సహకారాలు అందిస్తోంది. ఇతీవలే భారత్ 8 దేశాలతో చర్చలు జరిపింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రధానాంశంగా ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న పరిణామాలు, అక్కడి…
ఆఫ్ఘన్‌లో తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నారు. ఆ తరువాత అక్కడ కరోనా మహమ్మారి ఎలా వ్యాపిస్తున్నదో, కేసులు ఎమయ్యాయో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇక ఇదిలా ఉంటే, ప్రపంచ ఆరోగ్యసంస్థ, యూనిసెఫ్ సంయుక్తంగా ఆఫ్ఘనిస్తాన్‌లో పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. Read: స్పైస్ జెట్ సరికొత్త ఆఫర్: వాయిదాల్లో చెల్లించండి… ఆఫ్ఘన్‌లోని 3 మిలియన్ మంది పిల్లలకు…
ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్లపాటు సేవలు అందించిన అమెరికా దళాలు అగస్ట్ 30 వ తేదీ వరకు పూర్తిగాఖాళీ చేసి వెళ్లిపోయాయి. అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడ ఉండటం ఇష్టంలేని వ్యక్తులు ఆ దేశాన్ని వదిలిపెట్టి వలస వెళ్లిపోయారు. అమెరికా దళాలు వెళ్లే సమయంలోచాలా మందిని శరణార్థులను విదేశాలకు తరలించింది అమెరికన్ సైన్యం. కాబూల్‌లోని ఎయిర్పోర్ట్ వద్ద లోపలికి వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్న ఓ కుటుంబంలోని చిన్నారిని అమెరికా సైనికుడు అందుకొని లోపలికి తరలించాడు. ఓ గంట…
ఈరోజు న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పై టీం ఇండియాతో పాటు భారత అభిమానులు మొత్తం ఆశలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ లో ఆఫ్మఘం గెలవాలని అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 ఒరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో నజీబుల్లా ఒక్కడే 73 పరుగులతో రాణించాడు.…
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా సొంత ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే తాలిబన్లు సొంత ఎయిర్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయింది. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర మిలిటెండ్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. వీటికి బుద్దిచెప్పేందుకు ల్యాండ్ పై నుంచి మాత్రమే కాకుండా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఆగడాలు తగ్గిపోతాయని తాలిబన్ ప్రభుత్వం అభిప్రాయపడింది. గతంలో ఆఫ్ఘన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసిన సైనికులు, అధికారులు తిరిగి వస్తే…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక ఆ దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పటి వరకు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల ఆక్రమణల తరువాత, వారిని స్పూర్తిగా తీసుకొని దేశీయంగా కొన్ని తీవ్రవాద సంస్థలు బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్లోని కీలక ప్రాంతాల్లోని మసీదుల్లో పెలుళ్లకు పాల్పడుతున్నారు. దీంతో వందలాది మంది సామాన్యులు బలైపోతున్నారు. Read: కొత్తగా పెళ్లైన వారు హ్యాపీగా…