మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరమే : తాలిబన్ల కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్ఘాన్‌లో మగాళ్లకు గడ్డం ప్రాణ గండంగా మారింది. గడ్డం గొరిగిస్తే, ప్రాణం తీస్తామంటున్నారు తాలిబన్లు. షరియత్ చట్టాల్లో షేవింగ్‌కు స్థానం లేదంటూ బార్బర్ షాప్‌లకు వార్నింగ్‌లు పంపించారు. అయినా గడ్డం గీస్తే అడ్డంగా నరికేస్తామని నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కొసాగిన అరాచక పాలనను మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు తాలిబన్లు. కాబూల్‌లో తాలిబన్లు అడుగు పెట్టగానే ఆ దేశ ప్రజలు వేలాది మంది ఎందుకు పారిపోయారో ప్రపంచానికి ఇప్పుడర్థమవుతోంది. 1996 నుంచి 2001 వరకు కాలకేయుల పాలనలో నరకం అనుభవించిన అమాయక అప్ఘానీలకు ఇప్పుడు మళ్లీ అవే కష్టాలు వచ్చిపడ్డాయి.
షరియత్ పేరు చెబుతూ రోజుకో హింసాత్మక విధనాన్ని ప్రజల మీద బలంగా రుద్దుతున్నారు. కిడ్నాప్ నెపంతో హెరాత్ ప్రావిన్స్‌లో మొన్న నలుగురు యువకులను కాల్చి చంపి, క్రెయిన్లకు వేళాడదీసిన కాళకేయులు, ఇప్పుడు తాజాగా మరో రూల్‌ను తీసుకొచ్చారు. అప్ఘానిస్తాన్‌లో మగాళ్లు గడ్డం గీసుకోవడం నేరం అని హెల్మాండ్ ప్రావిన్స్‌లో ఫత్వా జారీ చేశారు. తాలిబన్ల కొత్త రూల్‌తో దేశంలని బార్బర్‌షాపుల ఓనర్ల ఒళ్లంత చెమటలు పట్టిపోయాయి. అంతేకాదు తమ రూల్‌పై ఫిర్యాదు చేసే అధికారం ఎవరికీ లేదని కూడా ఆర్డర్ పాస్ చేశారు.
Also Read
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
హెల్మాండ్‌లో జారీచేసిన ఫత్వా ఎఫెక్ట్ కాబూల్‌లోనూ కనిపించింది. అనేక మంది బార్బర్‌షాపుల ఓనర్లు ఇప్పటికే షెట్టర్ దించేశారు. కొందరికైతే తాలిబన్లు నేరుగా ఫోన్లు చేసి మరీ బెదిరించారు. దుకాణాలు మూసుకోవాడం తప్ప మరో దారి కనిపించడం లేదని బోరుమంటున్నారు బార్బర్ షాపుల ఓనర్లు. 2001లో తాలిబన్లు పారిపోయిన తర్వాత ఇక్కడ అమెరికన్ హెయిర్ కటింగ్ స్టైల్లు పాపులర్ అయ్యాయి. వెస్ట్రన్ బలగాలతోపాటు, వారి కల్చర్‌ను కూడా ఒంటపట్టించుకున్నారు అనేక మంది అప్గానీలు. ఆడవాళ్లు తమ అందాన్న మెరుగు పర్చుకోడానికి బ్యూటీ పార్లర్లకు వచ్చేవాళ్లు. హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లతో పదిహేనేళ్లుగా ఉపాధి పొందిన అనేక మంది ఇప్పుడు ఆకలి చావులు చావాల్సి వచ్చింది. అసలే ఉపాది లేక ఇళ్లలో ఉన్న వస్తువులను అమ్ముకుని బతుకుతున్న అప్ఘానీలకు తాలిబన్ల తలతిక్క నిర్ణయాలు ప్రాణమీదకు తెస్తున్నాయి.
తాజావార్తలు
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!