Weather Report: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గడంతో.. పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టింది దీంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 16 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో హైదరాబాద్ వాసులు మరోసారి చలికాలం చలిని చవిచూడాల్సి వస్తోంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం.. దాదాపు అన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి గాలులు వీస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పడిపోవడంతో శీతాకాలపు చలి తిరిగి వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 30, 2024 వరకు హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 17 నుండి 20 డిగ్రీల సెల్సియస్‌లో ఉంటాయని TSDPS అంచనా వేసింది. ఆదిలాబాద్ జిల్లా పై చలి పంజా విసురుతుంది. కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ యూ లో 10.2డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. అదిలాబాద్ జిల్లాలోని అర్లీ టీ లో 10.7కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది.
Read also: Health Tips : రోజుకు రెండు సార్లు టీ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ లో పడ్డట్లే…
నిర్మల్ జిల్లాలోని పెంబి లో 11.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మంచిర్యాల జిల్లా నిల్వాయి లో 13.2ఉష్ణోగ్రతలు నమోదైంది. దీని ప్రభావంతో హైదరాబాద్ లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శీతాకాలపు చలి రాబోయే రెండు రోజుల్లో నగరానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో పొగమంచుతో కూడిన వాతావరణం కనిపించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హైదరాబాద్ కేంద్రం తెలిపింది. అయినప్పటికీ, పొగమంచు హెచ్చరికలు జారీ చేయబడలేదు మరియు సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మారేడ్‌పల్లిలో రాత్రి 15.2, పగటిపూట 28.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే తిరుమల గిరి, సేరిలింగంపల్లి, గోల్కొండ ప్రాంతాల్లో రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 16.5 నుంచి 16.9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతుంది. అదే గరిష్ఠ ఉష్ణోగ్రత 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుంది. బహుదూర్‌పురా పరిసర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 17.9, గరిష్టంగా 29 డిగ్రీలుగా నమోదైంది.
Astrology: జనవరి 29, సోమవారం దినఫలాలు