CM Revanth Reddy:ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపద్యం లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నారు. పోరు గడ్డ నుంచి ప్రచార హోరు మొదలు కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రకటనలు చేస్తారని జిల్లా జనం ఆశిస్తున్నారు. నాగోబా దేవస్థానం వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నాగోబా దర్శనం తరువాత ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ రానున్నారు. తర్వాత పునర్నిర్మాణ సభలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొననున్నారు.
ఇంద్రవెల్లి లో పునర్నిర్మాణ సభ షెడ్యూల్ ఇదే..
* మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా కెస్లాపూర్ కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు.
* మధ్నాహ్యం 1.35 గంటలకు రోడ్డు మార్గాన వెళ్లి నాగోబా దర్శనం.
* మధ్నాహ్నం 1.45 నుంచి 2.15 వరకు నాగోబా దేవస్థానం గోపురం, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం.
* మధ్నాహ్నం 2.15 నుంచి 3.15 వరకు దర్బార్ హాల్ లో కార్యక్రమాలకు హజరు.
* మధ్నాహ్నం 3.15 నాగోబా నుంచి రోడ్డు మార్గాన ఇంద్రవెల్లి కి రానున్న సిఎం రేవంత్.
* మధ్నాహ్నం 3.30 అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. అనంతరం మధ్యాహ్నం 3.50 నుంచి 4.50 వరకు భారీ బహిరంగ సభ.
* మధ్నాహ్నం 4.55 కు తిరుగుపయనం కానున్నారు.
Poonam Pandey Death: పూనమ్ పాండే మృతి?.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!