Minister Seethakka Visits Utnoor Ashram School: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివారం రాత్రి ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అంతేకాదు ప్రతి గదికి వెళ్లి అక్కడి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆత్రం సుగుణ, తదితరులు పాల్గొన్నారు.
Also Read: PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి పనుల ప్రారంభం!
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు గొప్ప లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. ఈ పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు సైతం అన్ని రంగాలు రాణించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా.. చదువును మధ్యలో ఆపేయకుండా అన్ని అవరోధాలను దాటుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.