Love Marriage: ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎలా పుడుతుందో చెప్పలేం అంటారు.. ఇలా ఇప్పటికే రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి.. అసలు ఎల్లలు లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి.. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లి, ఉద్యోగాలు చేస్తూ.. ప్రేమలో పడి ఆ తర్వాత ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు నడిపించిన ప్రేమికులు ఎంతో మంది ఉన్నారు.. తాజాగా, ఆదిలాబాద్ అబ్బాయి.. మయన్మార్ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు.. ఈ పెళ్లితో ప్రేమకు ఎల్లలు లేవని మరోసారి నిరూపించారు ప్రేమికులు.. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలానికి చెందిన అబ్బాయి.. మయన్మార్ అమ్మాయికి పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది.
Read Also: INDvsAUS Test: బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆ జట్టుదే.. మాజీ క్రికెటర్ కామెంట్స్
ఈ లవ్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్‌కు మయన్మార్‌కు చెందిన కేథరిన్‌కు చింతగూడలోని చర్చిలో ఇవాళ వివాహం జరిగింది.. గొల్లపల్లి రవి కుమార్, మయన్మార్‌కు చెందిన జిన్ న్వేథెన్‌ల వివాహం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం ఘానంగా జరిగింది.. అయితే, రవి కుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్‌లోని జిన్ న్వేథేన్ దోహా నగరంలోని హోటల్ మేనేజ్మెంట్‌లో పని చేస్తున్న సమయంలో.. ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది.. ఇక, వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. దీంతో. ఇవాళ చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.. ఈ పెళ్లికి అమ్మాయి తరఫున ఆమె సోదరుడు క్యాహు క్యాహు థియేన్ హాజరుకాగా.. వరుడి తరపున బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.