రాజకీయం అంటే ఆషామాషీ కదు.. అవగాహన లేకుండా రాజకీయాలు చేస్తామంటే దొరికిపోతారు. అపరిపక్వత లేని రాజకీయ నాయకులు ఉంటే ప్రజల ముందు పరువు పోగొట్టుకోవాల్సిందే. అలాంటి కోవలోకే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల హాజరై అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన ఆదివాసీ వీరులకు సలామ్.. ఇంద్రవెల్లి పోరుగడ్డకు సలామ్ అంటూ వ్యాఖ్యనించింది. సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆదివాసీలు అన్యాయానికి గురవుతున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని ఆమె అన్నారు.
Also Read : Aishwarya Rai Daughter : హైకోర్టులో గెలిచిన ఐశ్వర్యరాయ్ కూతురు
అనంతరం వైఎస్ షర్మిల ఎంపీ సోయం బాపురావుతో మాట్లాడారు. ఇక్కడే ఆమె పొరపాటుపడింది. ఆదివాసీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ ఎంపీగా మీరు సీఎం కేసీఆర్ తో మాట్లాడి పోడు భూములకు పట్టాలు ఇప్పించండి అని షర్మిల సోయం బాపురావును కోరింది. ఆమె మాటలు విన్న ఎంపీ షాక్ అయ్యాడు. తాను గెలిచింది బీజేపీ నుంచి అయితే ఈమె ఏందీ బీఆర్ఎస్ ఎంపీని అంటోంది అని ఆలోచించి వెంటనే సోయం బాపురావు రియాక్ట్ అయ్యారు. అమ్మ నేను గెలిచింది.. బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీంతో తప్పును గ్రహించిన షర్మిల ఎంపీ సోయం బాపురావును క్షమాపణలు కోరింది. మీరు బీఆర్ఎస్ ఎంపీగా భావించా అని పొరపాటు దిద్దుకుంది. ఈ పరిణామంతో అక్కడ ఉన్నవారందూ షర్మిల వ్యాఖ్యలకు నవ్వుకున్నారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Ponniyin Selvan 2: చోళులు వచ్చేసారు… ఈసారైనా నిలబడతారా?
ఎవరు ఏమిటో తెలుసుకో షర్మిల అని నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఉండాలంటే అన్నింటిపై కనీస అవగాహన ఉండాలంటూ కౌంటర్లు వెస్తున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడి పరిస్థితులు, నాయకుల గురించి తెలుసుకోవాలి అని సూచిస్తున్నారు. మొన్న తమ్మినేని వీరభద్రం చేసిన అవమానం మరిచిపోయావా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ముందు వెళ్లి రాజకీయాలు నేర్చుకో.. ఆ తర్వాత ప్రజల మధ్యకు రా తల్లీ అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అందుకే చెప్పేది.. నువ్వు తెలంగాణ నాయకురాలివి కావు.. నీకు తెలంగాణ రాజకీయాలు తెలియవు.. ఇక్కడి నాయకులు తెలియదు.. వెళ్లు ఏపీకి అంటూ సోషల్ మీడియాలో షర్మిలను ఏకిపారేస్తున్నారు.