అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టారు. మొత్తంగా రూ.6.7 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.
మేడ్చల్ జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. వంద రోజుల్లో 55 కి పైగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అన్ని శాఖలో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది.
బంజారాహిల్స్ సీఐ నరేందర్ ఇంట్లో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇక, ఏసీబీ అధికారులు సీఐను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది. ఈ వ్యవహారంలో ఎస్ఐ నవీన్రెడ్డి, హోంగార్డ్ హరిని కూడా ఏసీబీ విచారిస్తుంది.