ENC Hariram : తెలంగాణలో మరోసారి అవినీతి కలకలం
- హరి రామ్ పై ఏసీబీ దాడులు
- 200 కోట్ల పైచిలుకు ఆస్తులు స్వాధీనం
- హరి రామ్ అరెస్టు, 14 రోజుల రిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ENC Hariram : తెలంగాణలో మరోసారి అవినీతి కలకలం రేపింది. కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) హరి రామ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసి, అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 13 చోట్ల భారీగా సోదాలు నిర్వహించారు. గజ్వెల్ లో ప్రారంభమైన ఈ దర్యాప్తు, హరి రామ్‌కు చెందిన ఆస్తులను గుర్తించడంలో కీలకమైన భాగం కావడమే కాక, ఆస్తుల విలువ కూడా ఆహ్లాదకరంగా ఉంది.
ఈ సోదాలు షేక్‌పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ లోని విల్లాలు, ఫ్లాట్లు, ఏపీ అమరావతిలోని కమర్షియల్ ఫ్లాట్‌లతో పాటు, మార్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను కూడా గుర్తించాయి. ఇక, బొమ్మల రామారంలో 6 ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్, కొత్తగూడెం, కుబ్బులాపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లను కూడా అధికారులు గుర్తించారు.
Also Read
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
ఆయన వద్ద బీఎండబ్ల్యూ కార్, భారీగా బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు కూడా అధికారులు పట్టుబట్టారు. ఈఎన్సీ హరి రామ్‌ను అరెస్టు చేసి, అర్థరాత్రి జడ్జి ఇంట్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 14 రోజుల రిమాండ్‌ను విధించిన అనంతరం, హరి రామ్‌ను చంచల్గూడా జైలుకు తరలించారు. సోదాలు తెల్లవారుజామున 2 గంటలకు ముగిసిన తర్వాత, 3 గంటలకు జడ్జి ఇంట్లో హరి రామ్‌ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
ఏసీబీ అధికారులు హరి రామ్ పై కొనసాగించే దర్యాప్తును మరింతగా పెంచుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారుగా రూ.200 కోట్లు కాగా, వీటి బహిరంగ మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే 10 రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు. ఈ దర్యాప్తులో షేక్‌పేట్, కొండాపూర్, మాధాపూర్, కోకాపేట్, సంజీవారెడ్డినగర్, కుత్బుల్లాపూర్, యల్లారెడ్డిగూడ, పటాన్‌చెరు, యాదగిరిగుట్ట, కొత్తగూడెం, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను గుర్తించారు.
తాజావార్తలు
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!