వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి.. ఇక, ఈ నెల 12వ తేదీన మిథున్‌రెడ్డి బెయిల్‌పై తీర్పు వెలువరించనుంది ఏసీబీ కోర్టు..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. సిట్ అధికారులు ఓ వైపు దర్యాప్తులో దూకుడు చూపిస్తున్నారు.. మరోవైపు, ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టుకు బయల్దేరాడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇప్పటికే కీలక నేతల అరెస్ట్ వ్యవహారం కాకరేపుతుండగా.. తాజాగా, లిక్కర్ స్కాం కేసులో నిందితుల అరెస్ట్ కోసం వారెంట్ పిటిషన్లు దాఖలు చేసింది సిట్.. మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేయటం కోసం అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు..
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు ఆగస్ట్ ఒకటో తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన రూ.8కోట్ల నగదు సహా డిస్టిలరీలు, నిందితుల అనుమానాస్పద…
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనున్న భారత్. లీడ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్. విశాఖ: నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్రమోడీ. సాయంత్రం 6.45 నిముషాలకు ఐఎన్ఎస్ డేగా వైమానిక స్థావరానికి చేరుకోనున్న ప్రధాని. స్వాగతం పలుకనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు. పెహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్ర మౌళి భార్యకు ప్రధానిని కలిసే అవకాశం.. స్వాగత కార్యక్రమాల తర్వాత తూర్పు నావికాదళ…
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తోంది సిట్. ఈ కేసులో నలుగురు నిందితులు రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఒకే సారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేసింది సిట్. ఈ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింది సిట్. ఈ క్రమంలో తిరుమల లడ్డు నెయ్యి కేసులో డొంక కదులుతోంది. సిట్ ఇప్పటికీ చార్జ్ షీట్ వేసింది. భోలేబాబా డెయిరీ కేంద్రంగా దర్యాప్తు చేస్తోంది.. తాజాగా టీటీడీలో జరిగిన అంశాలపై దర్యాప్తు ప్రారంభమైంది. Also Read:Telegram Global Contest: కంటెంట్ క్రియేటర్ల…
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్ట్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వోఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. మద్యం కుంభకోణంలో కేసులో A 31 ధనుంజయ రెడ్డి, A 32 కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం రోజు అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సిట్ అధికారులు.. సుమారు మూడు గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు కొనసాగాయి..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఐదు కేసులో వల్లభనేని వంశీ మోహన్‌కు.. బెయిల్, ముందస్తు బెయిల్లు ఉండగా.. ఇప్పుడు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వంశీకి బెయిల్ వచ్చేసింది.. అయితే, ఈ కేసులో బెయిల్ వచ్చినా.. వేరే కేసులో రిమాండ్ విధించడంతో.. వల్లభనేని వంశీ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది..