MP Midhun Reddy: లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. దానితో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరచడానికి తీసుకుని వెళ్లుతున్నారు. ఎస్కార్ట్ సిబ్బంది, ఏసీబీ పోలీసులు ప్రత్యేక వాహనంలో రాజమండ్రి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి రిమాండ్ నేటితో ముగియనుంది. రిమాండ్ పొడిగింపు నిమిత్తం విజయవాడ…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి.. విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రాజ్ కేసిరెడ్డి..
ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టులో కాస్త ఊరట దక్కింది.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు..
ఛార్జిషీట్‌లో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది సిట్.. ప్రైమరీ ఛార్జ్‌షీట్, రెండో అదనపు ఛార్జిషీట్ లో మొత్తం 20కి పైగా అభ్యంతరాలు లేవనెత్తి.. నివృత్తి చేయాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని నివృత్తి చేస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిట్.. సీల్డ్ కవర్ లో రెండు ఛార్జిషీట్లలో అభ్యంతరాలపై విడివిడిగా కౌంటర్లు కోర్టుకు సమర్పించింది సిట్..
ఏపీ లిక్కర్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు పంపింది. ఆస్తులను ఆటాచ్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని 11 మందికి నోటీసులు ఇచ్చింది. పలువురు డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు, లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల అటాచ్ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన నోటీసులపై అభ్యంతరం లేదని నోటీసులు అందుకున్న పలువురు తెలిపారు. నేడు కోర్టుకు హాజరైన కేసులో నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం,…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం .. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలిస్తున్నారు అధికారులు.
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సోమవారం రోజు సిట్‌కు ఝలక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్‌షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా..? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లయ్ అవుతుందో చెప్పాలని అడిగారు.
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏ31 రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆడిటర్ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఓవైపు విచారణలు.. మరోవైపు.. కోర్టులో పిటిషన్లు.. ఇంకో వైపు.. పిటిషన్లపై విచారణ ఇలా.. ఈ రోజు కీలకంగా మారింది..