విజయవాడ ఏసీబీ కోర్టులో రెడ్ బుక్ అంశంలో నారా లోకేశ్ పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. లోకేశ్ తన ప్రసంగాల్లో రెడ్ బుక్ అంశం ప్రస్తావనకు తెస్తుండడం పట్ల.. సీఐడీ గత నెలలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఐడీ తెలిపింది. ఈ క్రమంలో.. లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై…
లోకేష్‌ను అరెస్ట్ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్ ఉల్లంఘించినట్టు పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది. చంద్రబాబు కేసుల్లో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని సీఐడీ తెలిపింది.
ACB Court on Chandrababu Naidu PT Warrants: టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. మాజీ సీఎం చంద్రబాబు జైల్లో ఉండగానే.. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సీఐడీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. ప్రస్తుతం బాబు బెయిల్‌పై బయట ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్…
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని అధికారులు బులెటిన్‌లో తెలిపారు.
మధు ఖోడా, సిబు సోరేన్, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసింది అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు విషయంలో కూడా అంతే.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుపై ఆధారాలు ఉన్నాయి కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు రిమాండ్ నేటికి 37వ రోజుకు చేరుకుంది. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న స్నేహా బ్లాక్ లో ఏసీ ఏర్పాటుకు సెంట్రల్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.