ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాపుకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. అనుమతి తీసుకుని సమావేశానికి పలువురు నేతలు హాజరుకాలేదు. మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి సమావేశానికి వచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వర్క్‌షాపును ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ కార్యక్రమం ప్రాధాన్యతను వివరించారు. గడపగడపకూ అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం. దాదాపు 8 నెలలపాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక్కో…
ఏపీలో ఇంకా ఎన్నికలు టైం వుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ముందస్తు ముహూర్తాలు పెట్టేస్తోంది. వైసీపీ నేతలు కూడా ముందస్తు మాట ఎత్తకుండానే ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. 2024 కి కంటే ముందు ఎన్నికలు జరిగినా. జరగకపోయినా ఏపీలో మాత్రం పొత్తులు వుంటాయనేది జగమెరిగిన సత్యం. బీజేపీ-జనసేన కలిసి నడుస్తాయని బీజేపీ నేతలే ఎక్కువగా ప్రకటిస్తున్నారు. తాజాగా అమరావతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన-బీజేపీ…
ఒంగోలులో నిర్వహించిన తెలుగుదేశం మహానాడు టీడీపీలో జోష్ నింపింది. అయితే పార్టీలో అక్కడక్కడ ధిక్కారంతో వున్న నేతలకు చంద్రబాబు క్లాస్ పీకారు. మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వరుస సమావేశాలకు నిర్ణయం తీసుకున్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే సమీక్షలు ప్రారంభించిన చంద్రబాబు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల…
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే అని అన్నారు. 2024లో ఇప్పడు ఉన్న సీట్లు కూడా తగ్గుతాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 30-35 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. ఇదిలా ఉంటే మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) హస్తం ఉందని అన్నారు. తాజాగా అస్సాం బటద్రవాలో పోలీస్ స్టేషన్…
బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ పార్టీని, 2024 ఎన్నికలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ పురూలియాలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించార. వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవబోదని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ను ‘కల్తీ’గా అభివర్ణించారు. నోట్ల రద్దు,…