తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తేవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారు. 72 ఏళ్ల చంద్రబాబు తన వయస్సు గురించిన ఆందోళనలను కూడా పక్కనబెట్టి పార్టీ కోసం శ్రమిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. వీలైనంత ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండేందుకు టీడీపీ అధినేత ప్రయత్నిస్తున్నారు. వయస్సు గురించి ప్రస్తావిస్తే.. తన వయస్సు గురించి దిగులు చెందాల్సిన పనే లేదంటారాయన. ఆ మాటకొస్తే ప్రధాని మోదీది కూడా…
సింహం సింగిల్‌గానే వస్తుంది.. మళ్లీ జగనే సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో బలమైన ప్రభుత్వం ఉంది… ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. పొత్తులు పొత్తులు అని మాట్లాడుతున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు బట్టలు చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తులు అంటున్నాయి.. సింహం సింగిల్ గానే…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయినా.. ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతోంది.. ప్రతిపక్ష టీడీపీ ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అంటుంటే.. అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు పోయేదేలేదని స్పష్టం చేస్తోంది. ఇక, పొత్తులపై కూడా చర్చ సాగుతోంది.. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చకు తెరలేపారు. అయితే, 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. Read…
2024 ఎన్నికలే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లతో కీలక సమావేశం నిర్వహించారు. వచ్చే రెండేళ్లలో పార్టీ పైనే ప్రధానంగా దృష్టి సారించాలని జగన్ సూచించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ట పరచడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. గడప గడపకు వైసీపీ సర్వే చేస్తుందన్నారు. సర్వేలో రిజల్ట్ బాగా వచ్చినోళ్లకే సీట్లు అని స్పష్టం…
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ టైం వుంది. కానీ అప్పుడే వేడి మరింతగా రాజుకుంది. ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన రిపోర్ట్‌లో.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికార వైసీపీతో పొత్తుపెట్టుకోవాలని ఓ ప్రతిపాదన చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి…
వైసీపీ నేతలు అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ప్రారంభం అయింది. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభమైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సభకు భారీ స్ధాయిలోవైసీపీ నేతలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేను ఎవరికి పోటీ కాను…నాకు నేనే పోటీ అన్నారు అనిల్. ఎవరికీ బల నిరూపణ చేయాల్సిన అవసరం లేదు. జగన్ అన్న…
ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం విస్తరణ వివాదాలు రేపింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ అసంతృప్తికి లోనయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిది అదే కథ. అయితే ఆయన ఇప్పుడిప్పుడే ఆ షాక్ నించి బయటకు వస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, జనసేనపై కీలక కామెంట్లు చేశారు. టీడీపీని సమాధి చేద్దామని నా వెంట వస్తున్న వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు. టీడీపీ హయాంలో జాకీ వెళితే.. దొంగలు పడ్డ ఆరు…
రాష్ట్రంలోనూ దేశంలో ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్ విత్తనాలే అన్నారు సోము వీర్రాజు. విశాఖ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బీజేపీ చారిత్రాత్మకమైన పార్టీ. ఏపీలోనూ బలమైన శక్తిగా ఎదుగుతాం అన్నారు.దేశ రాజకీయాలలో అవినీతిని తొలగించడానికి బీజేపీ ఆవిర్భవించింది. జాతీయ భావాలతో పనిచేస్తాం. బీజేపీ ఈదేశానికి చారిత్రక అవసరం అన్నారు సోము వీర్రాజు. https://ntvtelugu.com/dharmana-krishnadas-sensational-comments/ రేపటి…
అక్కడ టీడీపీ లీడర్లకు కొదవ లేదు. కానీ.. వారిపై కేడర్‌కే క్లారిటీ లేదు. ఎవరు పార్టీని లీడ్ చేస్తారో.. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థెవరో తెలియక సతమతం చెందుతున్నారట. ఎవరివైపు వెళ్లాలో తేల్చుకోలేక అయోమయంలో ఉన్నారట తమ్ముళ్లు. కావలిలో టీడీపీ కేడర్‌కు దిశానిర్దేశం లేదా?ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గం కావలి. అలాంటిచోట సైకిల్ పార్టీని నడిపించే నాయకుడు కరువయ్యాడు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. బీద మస్తానరావు పార్టీని వీడి వెళ్లాక…