ఒంగోలులో నిర్వహించిన తెలుగుదేశం మహానాడు టీడీపీలో జోష్ నింపింది. అయితే పార్టీలో అక్కడక్కడ ధిక్కారంతో వున్న నేతలకు చంద్రబాబు క్లాస్ పీకారు. మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వరుస సమావేశాలకు నిర్ణయం తీసుకున్నారు.
సొంత జిల్లా చిత్తూరు నుంచే సమీక్షలు ప్రారంభించిన చంద్రబాబు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతల పని తీరుపై నివేదిక ఇచ్చారు బీదా రవిచంద్ర. నెలలో పదిహేను రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించాలని బీదాకు చంద్రబాబు సూచించారు.
క్షేత్ర స్థాయి పర్యటన తర్వాత నేతల పని తీరుపై డిటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీకి చికాకు కలిగించే నేతల జాబితా సిద్దం చేయాలని రవిచంద్రకు బాబు స్పష్టీకరించారు. నెల రోజుల్లోగా నేతల మధ్య విబేధాలు, గ్రూపు రాజకీయాలు లేకుండా చూడాలన్నారు చంద్రబాబు. నెల రోజుల తర్వాత కూడా మార్పు రాని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు.
మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వరుస భేటీలు నిర్వహించనున్నారు చంద్రబాబు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారంటున్నారు పార్టీ వర్గాలు. చిత్తూరు జిల్లాపై వైఎస్సార్సీపీ నేతలు ఫోకస్ పెట్టి.. చంద్రబాబుని కుప్పంలో సైతం ఓడిస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా సమయం వున్నా. ఇప్పటినుంచే పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై ఇకనుంచి కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించారు.
Firing In America: అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత.. నలుగురు మృతి