టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఒక స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వచ్చి తనపై పోటీచేసి ఓడించాలన్నారు. నన్ను ఓడించాలంటే తుప్పు నాయుడు, పప్పునాయుడు వచ్చినా ఏం చేయలేరన్నారు. మేం ఏ వర్గాలకు అందుబాటులో వుంటున్నాం, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. చంద్రబాబు వస్తాడు వెళతాడు. గుడివాడ ప్రజలు పిచ్చికుక్కలా చూస్తున్నారు.
చంద్రబాబు స్వంతంగా గెలిచింది లేదు. నాలుగు సార్లు చంద్రగిరి నియోజకవర్గంలో పోటీచేస్తే.. 3 సార్లు టీడీపీ గెలిచింది. చంద్రబాబు హయాంలో ఎన్నిసార్లు గెలిచారు. చంద్రబాబు నారావారి పల్లె చంద్రగిరిలో వుంది. చంద్రగిరిలో టీడీపీని గెలిపించుకున్నారు. స్వంతంగా పుట్టి పెరిగిన చోటు చంద్రబాబు 420 అని భావించే జనం ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేక పోయాడు. చంద్రబాబు మాటలు ఎవరు నమ్ముతారు. చంద్రబాబు వస్తే చేసేదేం లేదన్నారు కొడాలి నాని. ఇటువంటి చవట, సన్నాసి దద్దమ్మ కుప్పంలో గెలవలేకపోతున్నాడు. డబ్బులు వున్నాయని గుడివాడ వస్తే కుక్కకాటుకి చెప్పుదెబ్బలా 2024లో మళ్ళీ ఓడిస్తారన్నారు.
ఎంత మంది దిగొచ్చినా కొడాలిని ఏం చేయలేరని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏ రంగు అయినా వేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గుడివాడ వస్తారు వెళ్తారు..కానీ, ఎప్పటి నుంచో గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు చెబుతూనే ఉన్నారన్నారు. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వారు కాదని పేర్కొన్నారు.. తనను ఓడించినా..గెలిపించినా అది గుడివాడ ప్రజల చేతిలోనే ఉందన్నారు. చంద్రబాబు వచ్చి గుడివాడలో పోటీ చేసినా గెలవలేడన్నారు.
మేం ప్లీనరీ చేసుకుంటున్నాం కాబట్టి హోర్డింగ్ లు పెట్టాం. చంద్రబాబు వస్తున్నాడని మేం ఏం పబ్లిసిటీ ఇవ్వడం లేదు. ఎన్టీఆర్ జనం మనిషి. ఆయన విగ్రహానికి ఏ రంగులైనా వేయవచ్చు. ఎన్టీఆర్ కి టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు చంద్రబాబు. టీడీపీ డబ్బులు కూడా చంద్రబాబు కొట్టేశాడన్నారు. ఈసీ నుంచి లెటర్ తెచ్చి టీడీపీ నుంచి ఎన్టీఆర్ ని బహిష్కరించారన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ ని వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడవద్దన్న చంద్రబాబు నాపై విమర్శలు చేయడం ఏంటన్నారు. ఎన్టీఆర్ పేరు చెప్పి మళ్లీ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం నేను పెట్టాను. నా పేరు తీసేశారు. ఎన్టీఆర్ ప్రజల ఆస్తి. ప్రతి అభిమాని ఆయన గుండెల్లో వుంటారు.
ఎన్టీఆర్ బొమ్మలు ఎవరైనా పెట్టుకోవచ్చు. నా ఇష్టం వచ్చిన చోట ఎన్టీఆర్ బొమ్మలు పెడతా. ఎన్టీఆర్ పార్టీని దొంగిలించిన దొంగ ఎవరన్నారు కొడాలి నాని. రామారావుకి రంగులు లేవన్నారు కొడాలి నాని. చంద్రబాబుకు ప్రకృతి సహకరించదన్నారు మరో మాజీ మంత్రి కొడాలి నాని. ఎవరైనా చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు. మహానాడు తర్వాత మినీ మహానాడు చేయటం చంద్రబాబు తెలివి తక్కువ తీరుకు నిదర్శనం. ఎన్టీఆర్ ఆత్మే వాతావరణం మార్చి మహానాడు జరగకుండా చేసింది. తనను దేవుడిలా కొలిచే కొడాలి నానిని ఓడిస్తానని చంద్రబాబు చెప్పడాన్ని ఎన్టీఆర్ ఆత్మ ఎలా భరిస్తుంది?? అన్నారు నాని.
Corona: నాలుగో వేవ్ భయం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ