స్వదేశంలో భారత్ జట్టు ఏడాది కాలంలో రెండు టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్‌కు గురైంది. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక స్వదేశంలో న్యూజీలాండ్ (0-3), దక్షిణాఫ్రికా (0-2) చేతిలో టీమిండియా వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. దాంతో గౌతీపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. అటు మాజీలు, ఇటు అభిమానులు ఏకిపారేస్తున్నారు. గంభీర్ కోచింగ్ శైలిపై అందరూ మండిపడుతున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులకు సంబంధించి ఆయనపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు, గంభీర్, జట్టు సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు…
టీమిండియా స్టార్ బ్యాటర్ ‘విరాట్ కోహ్లీ’ మరలా టెస్ట్ క్రికెట్ ఆడనున్నాడా? అంటే.. అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కోహ్లీని టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చేలా ఒప్పించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయత్నాలు చేయడనికి సిద్దమైందట. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం ఉన్నట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. ఈ ఏడాది మే 12న కింగ్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్‌లో జట్టును బ్యాలెన్స్ చేయడానికి…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ WTC ఛాంపియన్స్ దక్షిణాఫ్రికా అద్భుతమైన ప్రదర్శన చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సైమన్ హార్మర్ అద్భుతంగా బౌలింగ్ చేసి, మొదటి టెస్ట్‌లో మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. భారత్- దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగింది. Also Read:HYD: దాంపత్యాలు…
IND vs Sa Test: కోల్‌కతాలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో 159 రన్స్ కే ఆలౌట్ అయింది. భారతపేస్ దళ నాయకుడు బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగడంతో.. సఫారీ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.
Sachin Shares First Memory Of Watching Root: ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ హవా నడుస్తోంది. ఈతరం ఫాబ్ ఫోర్‌లో మిగతా ముగ్గురు (విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియంసన్) తడబడినా.. రూట్ మాత్రం పరుగుల వరద పారించాడు. 2021 ముందు వరకు ఓ మోస్తరుగా సాగిన రూట్ కెరీర్.. ఆపై ఊహించని రీతిలో ఊపందుకుంది. ఈ 4-5 ఏళ్లలో ఏకంగా 22 టెస్ట్ శతకాలు బాదాడు. ఈ…
2025 సంవత్సరం క్రికెట్ అభిమానులకు ఒకరకంగా విషాదకరమైన సంవత్సరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే క్రికెట్‌కు చాలామంది దిగ్గజ క్రీడాకారులు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఛతేశ్వర్ పుజారా కూడా చేరాడు. తన వన్డే కెరీర్‌లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పుజారా, టెస్ట్ క్రికెట్‌లో మాత్రం 103 మ్యాచ్‌లలో మొత్తం 7,195 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పుజారా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.
Wiaan Mulder: జింబాబ్వేతో జరిగిన రెండవ టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అజేయ 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా తన ఇన్నింగ్స్ ను 367 పరుగుల వద్దే డిక్లేర్ ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు 6 వికెట్లకు 626 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. Read Also:Russia Over Ukraine: తగ్గేదెలా.. అన్నట్టుగా ఉక్రెయిన్‌పై 100కిపైగా డ్రోన్లతో భారీ దాడి…
టీమిండియా మాజీప్లేయర్, లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా మొదటి టెస్టులో మన బ్యాటర్లు సెంచరీలు చేసిన విధానంపై అసహనం వ్యక్తం చేశాడు. మొదటి టెస్టులో మనవాళ్లు 5 సెంచరీలు చేశారు. కానీ డాడీ హుండ్రేడ్స్ ఎక్కడా.. అని ప్రశ్నించాడు. అవి చేయలేదు కాబట్టే మ్యాచ్ ఓడిపోయారు. అంతే కాదు కొంతమంది బ్యాటర్లు డిఫెన్సివ్ మోడ్ లో బ్యాటింగ్ చేశారు అని ఆరోపించాడు.
జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టెండూల్కర్-ఆండర్సన్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరుగుతాయి. శుభ్‌మాన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఇంగ్లాండ్‌కు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ పర్యటనలో భారత్ గెలవడం కెప్టెన్ శుబ్ మన్ గిల్ కు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కు చాలా అవసరం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి…
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐసీసీ... మ్యాచ్ అఫిషియల్స్ ను ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లను ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా నియమించారు.