ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండు గ్రూప్ బీ లోనే ఉన్న విసహాయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు గత ఆదివారం ఆడిన మ్యాచ్ లో భారత్ పై పాక్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే నిన్న న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో కూడా పాకిస్థాన్ జట్టే విజయం సాధించింది. అయితే ఇలా అన్ని మ్యాచ్ లలో గెలిచి పాకిస్థాన్ జట్టు గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో మొదటిస్థానానికి వెళ్లడం భారత జట్టుకు కలిసి వస్తుంది అన్నారు వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా. అయితే ఈ టోర్నీలో ఒక్కో గ్రూప్ లో ఆరు జట్లు ఉండగా అందులో టాప్ 2 లో ఉన్న రెండు జట్లు మాత్రమే సెమిస్ కు వెళ్తాయి. కాబట్టి పాకిస్థాన్ జట్టు టాప్ లో ఉంటె ఆ తర్వాత రెండవ స్థానంలోకి ఇండియా సులువుగా రావచ్చు అని అన్నారు. కానీ వచ్చే ఆదివారం భారత్ – కివీస్ జట్లు తలపడనున్నాయి. కాబట్టి ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఇండియా సులువుగా టాప్ 2 కి వస్తుంది అని అన్నాడు లారా.